శ్రీశైలం క్యూలైన్‌లో కనిపించిన అరుదైన జంతువు.. వింతగా చూసిన భక్తులు.. వీడియో

| Edited By: Shaik Madar Saheb

May 22, 2024 | 6:49 PM

నంద్యాల జిల్లా శ్రీశైలం ఆలయంలోని క్యూలైన్లలో పునుగుపిల్లి కలకలం రేపింది. స్వామివారి దర్శనానికి వెళ్లే మార్గంలో.. మూడు వందల దర్శనం టికెట్ క్యూలైన్లలో ఒక్కసారిగా పై నుంచి పునుగుపిల్లి కిందపడింది. దీంతో ఒక్కసారిగా శబ్ధం రావడంతో..

శ్రీశైలం క్యూలైన్‌లో కనిపించిన అరుదైన జంతువు.. వింతగా చూసిన భక్తులు.. వీడియో
Srisailam Temple
Follow us on

నంద్యాల జిల్లా శ్రీశైలం ఆలయంలోని క్యూలైన్లలో పునుగుపిల్లి కలకలం రేపింది. స్వామివారి దర్శనానికి వెళ్లే మార్గంలో.. మూడు వందల దర్శనం టికెట్ క్యూలైన్లలో ఒక్కసారిగా పై నుంచి పునుగుపిల్లి కిందపడింది. దీంతో ఒక్కసారిగా శబ్ధం రావడంతో.. క్యూలైన్లలో ఉన్న భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో పరుగులు తీస్తున్న పునుగు పిల్లిని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ముందు ఏదో ప్రమాదకర జంతువు అనుకొని భయపడ్డారు.. ఆ తర్వాత పునుగుపిల్లి అని తెలిసి వింతగా చూశారు. ఈ సందర్భంగా కొందరు భక్తులు తమ ఫొన్లలో బంధించుకున్నారు.

అయితే.. క్యూలైన్లలో పునుగుపిల్లి అటుఇటు తిరుగుతూ ఎటు పోవాలో అర్ధంగాకా క్యూలైన్లలోని జాలిలోనుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది.. చివరకు సెక్యూరిటీ సిబ్బంది పునుగుపిల్లిని పట్టుకుని బయట వదిలేశారు.

వీడియో చూడండి..

అయితే.. శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కోసం వచ్చి.. పునుగుపిల్లిని రియల్ గా చూడటం ఇదే మొదటిసారని భక్తులు పేర్కొన్నారు. సాధారణంగా పునుగుపిల్లులు అడవులలో నీటి వడ్డున సంచరిస్తుంటాయి. అలాంటిది.. పునుగుపిల్లి ఆలయ క్యూలైన్లలో ప్రత్యక్షం కావడంతో భక్తులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..