
ఎన్టీఆర్ జిల్లాలో ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది. ఆ క్షణంలో డ్రైవర్ తీసుకున్న ఒక నిర్ణయం 39 కుటుంబాలలో దీపాలు ఆరిపోకుండా కాపాడింది. ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి బస్సు పక్కకు ఆపి ప్రయాణికులను సురక్షితంగా డ్రైవర్ దింపాడు. కొద్ది క్షణాల్లోనే బస్సు మొత్తం మంటల్లో కాలి బూడిదైంది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది..
ఎన్టీఆర్ జిల్లా పేరాలపాడు ఎన్ఎస్వి కాల్వ సమీపంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున పావని ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. బస్సులో ఉన్న 39 మంది ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. క్షణాల్లోనే మంటలు బస్సులు పూర్తిగా చుట్టుముట్టాయి. అయితే డ్రైవర్ అప్రమత్తతో పెద్ద విషాదంతో తప్పింది. సాధారణంగా సాగుతున్న ప్రయాణం ఒక్కసారిగా ఆందోళనకరంగా మారింది .బస్సు వెనుక భాగం నుంచి పొగలు ఎగసిపడటం డ్రైవర్ వెంటనే పరిస్థితి అర్థం చేసుకున్నాడు. ఇంజన్‌లో సాంకేతిక లోపం ఉందని అనుమానించి బస్సును రోడ్డు పక్కకు ఆపేశాడు. ఆలస్యం చేయకుండా ప్రయాణికులని ఒక్కొక్కరిని దిగిపోవాలని సూచించారు. కొంతమంది భయంతో కంగారుపడినా.. డ్రైవర్ సిబ్బంది సహాయంతో అందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
ప్రయాణికులు దిగిన కాసేపటికే బస్సు నుంచి మంటలు భారీగా వ్యాపించాయి. అతివేగంగా మంటలు బస్సులు కమ్మేశాయి. చూస్తుండగానే బస్సు మొత్తం ఆహుతైంది. లోపల ఉన్న సామాన్లు, సీట్లు , ఎలక్ట్రిక్ వైర్లు అన్ని కాలిపోయాయి. దూరం నుంచి నల్లని పొగలు కనిపించడంతో స్థానికులు అక్కడికి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న నేషనల్ హైవే సిబ్బంది స్థానికులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేశారు. అనంతరం ఫైట్ సిబ్బంది సహాయంతో మంటలను పూర్తిగా ఆర్పేశారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. బస్సు ఇంజన్ వేడెక్కడం వల్లే షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించాయని డ్రైవర్ చెప్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..