అయ్యో ఎంత కష్టం..! చెట్టు కిందే గర్భిణి ప్రసవం.. తల్లికి సపర్యలు చేసిన 11 ఏళ్ల కూతురు..!

అంతరిక్షంలో అడుగు పెడుతున్న రోజుల్లో కూడా జరుగుతున్న అమానుష ఘటనలు ఆందోళనలకు గురి చేస్తున్నాయి. తాజాగా విజయనగరం జిల్లా బొబ్బిలిలో హృదయవిదార ఘటన చోటుచేసుకుంది. ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్లేందుకు బయల్దేరిన ఓ గర్భిణి మార్గమధ్యలోనే పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. చివరికి ఆరుబయట చెట్టు కింద ప్రసవించింది. ఈ ఘటన అందరినీ కలచివేస్తుంది.

అయ్యో ఎంత కష్టం..! చెట్టు కిందే గర్భిణి ప్రసవం.. తల్లికి సపర్యలు చేసిన 11 ఏళ్ల కూతురు..!
Pregnant Woman Gave Birth

Edited By:

Updated on: Aug 30, 2025 | 8:00 PM

అంతరిక్షంలో అడుగు పెడుతున్న రోజుల్లో కూడా జరుగుతున్న అమానుష ఘటనలు ఆందోళనలకు గురి చేస్తున్నాయి. తాజాగా విజయనగరం జిల్లా బొబ్బిలిలో హృదయవిదార ఘటన చోటుచేసుకుంది. ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్లేందుకు బయల్దేరిన ఓ గర్భిణి మార్గమధ్యలోనే పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. చివరికి ఆరుబయట చెట్టు కింద ప్రసవించింది. ఈ ఘటన అందరినీ కలచివేస్తుంది.

పార్వతి అనే మహిళ రామభద్రపురం మండలం రొంపిల్లి పామాయిల్ తోటలో కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తుంది. తొమ్మిది నెలల నిండు గర్భిణీ అయిన పార్వతీకి అకస్మాత్తుగా పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. వెంటనే పదకొండు ఏళ్ల కుమార్తె శైలజాను వెంట తీసుకొని ఆటోలో బొబ్బిలి ఆసుపత్రికి బయల్దేరారు. అయితే మార్గమధ్యలోనే నొప్పులు ఎక్కువ కావడంతో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న మండల పరిషత్తు కార్యాలయం ఆవరణలో చెట్టు కింద ఆగారు. మరింత నొప్పులు ఎక్కువై చెట్టు క్రిందే ఆరుబయట ప్రసవం జరిగి పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ సమయంలో మరో మహిళ లేకపోవడంతో తోడుగా ఉన్న పదకొండేళ్ల కూతురే సపర్యలు చేసి తల్లికి సేవలు చేసింది.

అనంతరం తల్లి నుంచి బిడ్డను వేరు చేసుకునేందుకు అడ్డుగా ఉన్న బొడ్డును కోసేందుకు బ్లేడు కోసం సమీపంలో ఉన్న దుకాణానికి వెళ్ళింది కుమార్తె శైలజా. అలా శైలజ ద్వారా విషయం తెలుసుకున్న స్థానికులు 108 అంబులెన్స్‌ ద్వారా ఆసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డలను ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యులు మెరుగైన చికిత్స అందించారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. పార్వతికి ఇదివరకే ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉండగా ఇప్పుడు ఆమె ఆరో సంతానంకి జన్మనిచ్చింది. సాధారణ కాన్పులోనే ఎలాంటి వైద్యుల సహాయం లేకుండా ప్రసవించినప్పటికీ తల్లీబిడ్డలు క్షేమంగా బయటపడటంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే పార్వతీ నిండు గర్భిణీ అని తెలిసినా, పురిటి నొప్పులు పడుతుందని సమాచారం ఉన్నా స్థానిక వైద్య సిబ్బంది కానీ, ఆశా వర్కర్స్ కానీ ఆమెకు అండగా నిలవకపోయారు. ఈ ఘటన ప్రభుత్వ సిబ్బంది వ్యవహారశైలిపై మండిపడుతున్నారు జిల్లావాసులు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..