Kadapa District: ఉదయాన్నే తన పసుపు చేనుకు వెళ్లిన రైతు షాక్.. నడి పొలంలో

|

Sep 07, 2022 | 8:13 PM

ఆ రైతు తన పొలంలో పసుపు వేశాడు. పంట ఏపుగా పెరుగుతుంది. వర్షాలు కూడా సమృద్ధిగా పడతూ ఉండటంతో.. ఈ ఏడాది తనకు తిరుగులేదు అనుకున్నాడు. కానీ....

Kadapa District: ఉదయాన్నే తన పసుపు చేనుకు వెళ్లిన రైతు షాక్.. నడి పొలంలో
Pit
Follow us on

Andhra Pradesh: YSR కడప జిల్లాలో ఓ రైతు వింత అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. రోజులానే తన పసుపు పొలానికి వెళ్లిన రైతకు పొలంలో భారీ గొయ్యి కనపడింది. చింతకొమ్మదిన్నె మండలం(Chinthakommadinne Mandal) బయనపల్లి మండలంలో ఈ ఘటన వెలుగుచూసింది. విష్ణువర్ధన్​రెడ్డి అనే రైతు తన వ్యవసాయ క్షేత్రంలో పసుపు వేశాడు. బుధవారం వెళ్లి చూసేసరికి పొలం నడి మధ్యలో భూమి కుంగిపోయ్యి పెద్ద గొయ్యి ఏర్పడింది. ఈ గొయ్యి పొడవు.. లోతు దాదాపు 30 అడుగుల మేర ఉంది. ఈ భారీ గుంత లోపల వాటర్ ఉన్నాయి. నడి చేలో ఇలా జరగడంతో సదరు రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పావు ఎకరం మేర పంట పోయిందని..  అదీ కాక ఇకపై పొలానికి నీళ్లు వేయడం.. క్రిమి సంహారక మందులు పిచికారి చేయడం కుదరదని ఆవేదన వ్యక్తం చేశాస్తున్నారు. అయితే చింతకొమ్మదిన్నె మండలంలో ఇలా జరగడం మొదటిసారి కాదట. గతంలో కూడా కొన్నిసార్లు ఇలానే జరిగిందట. తాము పొలంలో ఉన్నప్పుడు ఇలా గుంతలు ఏర్పడితే ప్రాణాలకే ప్రమాదం అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదని.. అధికారులు ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని కోరుతున్నారు. కొందరు రైతులతే ఈ గుంతలకు బయపడి పొలాలు సాగు కూడా చేయడం లేదని చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..