పబ్లిక్‌గా అందరూ చూస్తుండగానే చెప్పు దెబ్బలు.. ఆరా తీస్తే తెలిసిందీ అసలు నిజం!

| Edited By: Balaraju Goud

Oct 27, 2024 | 5:41 PM

పారిపోతున్న వ్యక్తిని వెంటాడి వేటాడు మరీ పట్టుకుని చావబాదారు. భార్యాభర్తలు కలిసి చెప్పు దెబ్బలు కొట్టారు. కర్నూలు జిల్లాలో పబ్లిక్‌గా అందరూ చూస్తుండగానే జరిగింది.

పబ్లిక్‌గా అందరూ చూస్తుండగానే చెప్పు దెబ్బలు.. ఆరా తీస్తే తెలిసిందీ అసలు నిజం!
Harassment
Follow us on

భర్త పక్కన ఉండగానే పరాయి స్త్రీపై చేయి వేసి, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఇంకేముంది సదరు వ్యక్తికి భర్త చేతిలో చెప్పు దెబ్బలు తప్పలేదు. పారిపోతున్న వ్యక్తిని వెంటాడి వేటాడు మరీ పట్టుకుని చావబాదారు. భార్యాభర్తలు కలిసి చెప్పు దెబ్బలు కొట్టారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. ఇది పబ్లిక్‌గా అందరూ చూస్తుండగానే జరిగింది.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో అరుగు మీద భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నారు. అటుగా వెళుతున్న ఒక వ్యక్తి మద్యం మత్తులో అరుగు మీద కూర్చున్న మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. భర్త పక్కన ఉన్న మహిళపై వెకిలి వేషాలకు తెగించాడు. భర్త అడ్డుకు మందలించడంతో.. ఆ వ్యక్తి అక్కడి నుండి పరారయ్యాడు. ఆ వ్యక్తిని వెంటాడి పట్టుకున్న దంపతులు ఇద్దరు కలిసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

వీడియో చూడండి…

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..