Kakinada: పార్కింగ్ ప్లేస్ కాదు.. పోలీస్ స్టేషన్.. అసలు విషయం తెలిస్తే మీరు కళ్లు తేలేయడం ఖాయం

|

Jun 25, 2022 | 4:31 PM

బైక్స్ చోరీ చేయడంలో సెంచరీ చేశాడు. అయినా పోలీసులకు చిక్కలేదు. కొత్త బైక్స్‌ను కూడా తక్కువ ధరకు వస్తుండటంతో కొందరు వాటిని కొనుగోలు చేశారు. ఇప్పుడు తల పట్టుకుంటున్నారు.

Kakinada: పార్కింగ్ ప్లేస్ కాదు.. పోలీస్ స్టేషన్.. అసలు విషయం తెలిస్తే మీరు కళ్లు తేలేయడం ఖాయం
Bike Theft
Follow us on

AP News: అతని కంటికి ఇంపుగా మీ బైక్ కనిపించిందా… ఖతం కావాల్సిందే. ఏదైనా బైక్ నచ్చించా మాటు వేసి.. మాయం చేస్తాడు . ఎంత ఈజీగా కొట్టేస్తాడో…అంతే ఈజీగా అమ్మేయడం అతని స్పెషాలిటీ. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఇప్పటివరకు బైక్స్ కొట్టేయడంలో సెంచరీ దాటేశాడు.  ఏకంగా 111 బండ్లను కొట్టేసి.. అమ్మేశాడు. ఈ గజ దొంగ గురించి పోలీసులకు పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వచ్చాయి. దీంతో ఫోకస్ పెట్టిన కాకినాడ జిల్లా పోలీసులు జగ్గంపేట మండలం(Jaggampeta Mandal) మల్లిశాల(Mallisala)లో ఎంక్వైరీ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.  ఏలేశ్వరానికి చెందిన నడిగట్ల కృష్ణ చోర విద్యలో ఆరితేరాడని వెల్లడైంది. ఇతను జగ్గంపేటలో నివాసం ఉంటున్నాడు.  రాజమహేంద్రవరం, తుని,  తణుకు, మండపేట, జగ్గంపేట తదితర ప్రాంతాల్లో బైక్స్ కొట్టేసి జగ్గంపేట మండలం గోవిందపురం, కృష్ణపురం, రాజపూడి, మన్యంవారిపాలెం, మల్లిశాల తదితర గ్రామాల్లో తక్కువ ధరకు అమ్మేవాడు. గోవిందపురానికి చెందిన వ్యక్తి ఒకరు కృష్ణ నుంచి ఏకంగా 15 బైకులు కొని, సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. చోరీకి గురైన వాహనాలను కొనుగోలు చేసిన వారికి పోలీసులు ఫోన్లు చేస్తుండటంతో ఒక్కొక్కరుగా వాటిని పోలీసుస్టేషన్‌కు తీసుకొస్తున్నారు. ఇంకొందరతే తక్కువ ధరకు వచ్చాయని కొనుగోలు చేశామని.. తమపై కేసులు లేకుండా చూడాలని పోలీసులకు వేడుకుంటున్నారు. కాగా కొట్టేసిన వాహనాలు తీసుకొస్తూ ఉండటంతో పోలీస్ స్టేషన్‌ ప్రాంగణం బైక్‌లతో నిండిపోయింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..