Andhra Pradesh: కర్నూలు జిల్లా లద్దగిరిలో కేంద్ర మాజీమంత్రి, టీడీపీ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తి హల్‌చల్ చేశాడు. సూర్యప్రకాశ్ రెడ్డిని చంపేస్తానంటూ గట్టిగా అరిచాడు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న సూర్యప్రకాశ్ రెడ్డి వెంటనే.. పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు.. లద్దగిరిలోని ఆయన నివాసం వదదకు చేరుకున్నారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా వ్యక్తిని గుర్తించిన పోలీసులు.. సూర్యప్రకాశ్ రెడ్డి ఇంటి వద్ద కేకలు వేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేకలు వేసిన వ్యక్తి లద్దగిరి పక్కనే ఉన్న అల్లినగరం గ్రామానికి చెందిన లక్ష్మన్నగా గుర్తించిన పోలీసులు.. మద్యం మత్తులోనే అలా ప్రవర్తించినట్లు నిర్ధారించారు. అతని కేసు నమోదు చేసిన పోలీసులు జైలుకు తరలించారు.
కాగా, ఈ ఘటనపై కేంద్ర మాజీ మంత్రి అయిన సూర్యప్రకాశ్ రెడ్డి సీరియస్‌గా స్పందించారు. అల్లినగరం గ్రామానికి చెందిన లక్ష్మన్న తప్పతాగి తన ఇంటి వద్దకు వచ్చి దాడి చేసే ప్రయత్నం చేశాడని అన్నారు. తనను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని అన్నారు. ఓ తాగుబోతు తన ఇంటికి వచ్చి చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు అంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటి? అని సూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంలో క్రైమ్ పెరిగిపోతోందని, తాగుబోతులు చెలరేగిపోతున్నారని తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
Also read:
TS EAMCET 2021: బీ అలర్ట్ విద్యార్థులూ.. అక్టోబరు 5 వరకు మేనేజ్‌మెంట్ కోటా అడ్మిషన్లు..