కనకాంబరం.. కోయాలంటే నిచ్చెన వేయాల్సిందే.. అంత ఎత్తు ఎలా పెరిగిందబ్బా..!

చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే పూల మొక్క కనకాంబరం. వాసన లేకపోయినా కంటికింపైన రంగుల్లో తెగ ఆకట్టుకుంటుంది. తేలిగ్గా ఉండే ఈ పూలు మిగతా పూల కంటే భిన్నం. మూడు నాలుగు రోజుల పాటు తాజాగా కనిపిస్తాయి. తెలంగాణలో బతుకమ్మ పండగకు ఈ పూలు దండల్లా మారి.. పడచుల మనసులను దోచేస్తాయి.

కనకాంబరం.. కోయాలంటే నిచ్చెన వేయాల్సిందే.. అంత ఎత్తు ఎలా పెరిగిందబ్బా..!
Kanakambaram (crossandra Plant)

Edited By:

Updated on: Jan 20, 2026 | 3:18 PM

చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే పూల మొక్క కనకాంబరం. వాసన లేకపోయినా కంటికింపైన రంగుల్లో తెగ ఆకట్టుకుంటుంది. తేలిగ్గా ఉండే ఈ పూలు మిగతా పూల కంటే భిన్నం. మూడు నాలుగు రోజుల పాటు తాజాగా కనిపిస్తాయి. తెలంగాణలో బతుకమ్మ పండగకు ఈ పూలు దండల్లా మారి.. పడచుల మనసులను దోచేస్తాయి. అయితే, సాధారణంగా కనకాంబరాలు అనగానే నారింజ, పసుపు రంగుల్లో.. మోకాలు లోతు ఎత్తులో ఏపుగా పెరుగుతాయి. అయితే కర్నూలు జిల్లాలో పెరుగుతున్న ఈ మొక్క పూలు కోయాలంటే నిచ్చెన వేసుకోవల్సిందే..! పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

శ్రీలంక, దక్షిణ భారతదేశంలో ఎక్కువగా పెరిగే కనకాంబరం చెట్టు సాధారణంగా రెండు నుంచి మూడు అడుగుల ఎత్తు పెరుగుతుంది… అయితే ఆ ఇంట్లో ఉన్న కనకాంబరం చెట్టు ఏకంగా ఏడు అడుగులు పెరిగి ఆశ్చర్యపరుస్తోంది. ప్రకాశం జిల్లా దర్శిలో ఓ ఉపాధ్యాయ దంపతుల ఇంట్లో పెరిగిన కనకాంబరం చెట్టు, ఏడడుగులు పెరగడంతో పువ్వులు కోయాలంటే పక్కన ఉన్న మెట్లు ఎక్కాల్సిందేనంటున్నారు ఇంటి యజమానులు. తమ ఇంటి ఆవరణలోని జాజిమల్లి చెట్టుతోపాటు కనకాంబరం చెట్టు ఏపుగా ఎదిగిందని తెలిపారు. ఏడు నుంచి ఎనిమిది అడుగుల పొడవు ఉంది. దీని విత్తనాల నుంచి కూడా పొడవైన మొక్కలే వస్తున్నాయట. ఈ చెట్టు విత్తనంలో జన్యుపరమైన మ్యూటేషన్‌తోపాటు ఇక్కడి నేల సారాన్ని బట్టి ఏపుగా పెరిగిందని చెబుతున్నారు. ఇప్పుడు ఈ కనకాంబరం చెట్టు దర్శి పట్టణంలో విశేషంగా మారింది.

కనకాంబరం చెట్టు ఎక్కువగా ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలతోపాటు శ్రీలంకలో పెరిగే మంచి సుగంధవాసన వెదజల్లే పూలమొక్క. వీటి పూలు పసుపు, ఎరుపు, నారింజ రంగులో ఉంటాయి. మూడు రెక్కలుగా గుత్తులు గుత్తులుగా పూస్తుంది. ఈ పువ్వులు, ఆకులను సాధారణంగా దేవుని పూజకు, అలాగే అలంకరణల కోసం వాడుతుంటారు. సాధారణంగా ఈ మొక్కను ఇళ్లల్లో పూల కుండీల్లో పెంచుతారు. వాణిజ్యపరంగా అయితే నేలపై తక్కువ ఎత్తులోనే పెరుగుతుంది.

ఔషధ గుణాలు… కీటకనాశిని..

కనకాంబరాన్ని పూజలు, అలంకరణలతో పాటు వైద్య రంగంలో కూడా వినియోగిస్తారు. ప్రధానంగా హెర్బల్ వైద్య విధానంలో ఉపయోగిస్తుంటారు. ఇంటి చిట్కాలలో అల్సర్‌, దగ్గు వంటి రుగ్మతలకు వీటిని వాడుతుంటారు. ఆయుర్వేద మందులలో కూడా దీని వినియోగం ఎక్కువేనని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అలాగే కొన్ని రకాల బాక్టీరియాలను ఈ మొక్క ఆకులు, పువ్వులు అడ్డుకుంటాయట. సెల్‌ఫోన్లపై వచ్చే బాక్టీరియాలను సమర్ధవంతంగా నిర్మూలిస్తాయట.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..