
అనంతపురం జిల్లాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇంతలో దారుణం.. ఎల్లమ్మకాలనీలో మరో దారుణం జరిగింది. భార్య లక్ష్మీ గంగ గొంతుకోసి హత్య చేశాడు భర్త వీరాంజనేయులు. ఆ తర్వాత.. వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. బిందెల కాలనీకి చెందిన లక్ష్మీగంగ (27), పామిడి మండల కేంద్రానికి చెందిన వీరాంజనేయులు పదేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఎల్లమ్మ కాలనీలో నివాసముంటున్న వీరికి ఆరేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. కొన్నేళ్లపాటు కాపురం సవ్యంగా సాగింది. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. భార్య మరో వ్యక్తితో చనువుగా ఉంటుందన్న అనుమానంతో తరచూ గొడవలు జరిగేవి.
భార్య లక్ష్మీ గంగపై అనుమానంతో తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం (జనవరి 22) తెల్లవారుజామున కూడా భార్యతో గొడవ పడ్డాడు. ఆ గొడవలోనే ఆవేశంతో గొంతు కోసి చంపేశాడు. నేరుగా స్టేషన్‌కు వెళ్ళి పోలీసుల ముందు లొంగిపోయాడు. వీరాంజనేయులు, లక్ష్మీ గంగ ఓ హోటల్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. భార్యను తానే హత్య చేశానని వీరాంజనేయులు అంగీకరించాడు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..