
ఇంటి నుంచి బయటకు వెళ్ళిన కుమార్తె తిరిగి ఇంటికి రాలేదు. దాంతో తండ్రి కుమార్తె ఎక్కడికి వెళ్ళిందా అంటూ తన కోసం వెతుకులాట ప్రారంభించాడు. తనకు తెలిసిన వారందరినీ అడుగుతూ కుమార్తె జాడ కోసం తిరిగాడు. ఎంతకీ కుమార్తె జాడ తెలియకపోవడంతో తమ కుమార్తె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు. ఈలోగా జరగాల్సిన దారుణం జరిగిపోయింది. ముక్కుపచ్చలారని ఆ బాలిక మృతదేహన్ని ఇంటి సమీపంలోనే గుర్తించారు. మృతదేహాన్ని చూసిన ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. భీమవరం లెప్రసీ కాలనీకి చెందిన రత్నకుమారి (14) అనే బాలిక ఏడవ తరగతి చదువుతుంది. అయితే రెండు రోజుల క్రితం ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇంటికి నుంచి బయటకు వెళ్ళింది. ఎంతసేపైనా రత్నకుమారి తిరిగి ఇంటికి రాలేదు.
దీంతో రత్నకుమారి తండ్రి అంజి ఇంటి సమీపంలోని చుట్టుపక్కల ప్రాంతాలన్ని తన కూతురి ఆచూకీ కోసం గాలించాడు. తెలిసిన వారందరినీ తన కూతురు రత్నకుమారి కనిపించిందా అంటూ వెతక సాగాడు. ఎంత తిరిగినా, ఎక్కడ వెతికిన చివరకు ఆమె జాడ కనిపించలేదు. బంధువుల సైతం ఆమె ఆచూకీ కోసం తిరిగారు. చివరికి రత్నకుమారి తండ్రి అంజి పోలీస్ స్టేషన్కు వెళ్లి తన కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు రత్నకుమారి అదృశ్యంపై మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన మర్నాడు ఇంటి సమీపంలోనే దట్టమైన పొదలతో కూడిన జమ్ము గడ్డిలో రత్నకుమారి మృతదేహం స్థానికుల కంటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం రత్నకుమారిగా గుర్తించారు. రత్న కుమారి మృతి ఘటన తెలిసిన ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఇంటి నుంచి బయటకు వెళ్లిన రత్న కుమారి రెండు రోజుల తర్వాత ఇంటి సమీపంలోనే శవమై కనిపించడంతో ఆ ప్రాంతమంతా విషాదఛాయల అలుముకున్నాయి. అయితే రత్నకుమారిని హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అసలు ఆమెను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉందని ఆరా తీశారు. అప్పుడే నమ్మలేని నిజం పోలీసులను సైతం ఆశ్చర్యపడేలా చేసింది. రత్నకుమారికి బాబాయి వరసైన మావుళ్లు అనే వ్యక్తి ఆమెను హత్య చేసినట్లుగా నిర్ధారించుకున్నారు. అయితే ప్రస్తుతం నిందితుడు మావుళ్లు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అసలు రత్నకుమారిని మావుళ్లు ఎందుకు చంపాడు..? ముక్కుపచ్చలారని ఆమెను చంపవలసిన కక్ష అతను ఎందుకు పెట్టుకున్నాడు..? మావుళ్లుకి రత్నకుమారి తండ్రి అంజికి మధ్య ఏమైనా పాత కక్షలు ఉన్నాయా… లేక ఆస్తి గొడవలు ఏమైనా ఉన్నాయా.. హత్య మావుళ్లు ఒక్కడే చేశాడా… లేక అతనికి ఇంకా ఎవరైనా సహకరించారా.. అనే ప్రతి కోణంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. రత్నకుమారి తల్లిదండ్రులు, స్థానికులు మాత్రం ముక్కు పచ్చలారని ఆమె మరణానికి కారణమైన వారిని అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..