Nandyal district: ఉపాధి హామి మట్టి పనులు చేస్తుండగా బయటపడిన పురాతన కుండ.. దాన్ని ఓపెన్ చేయగా

|

Jun 23, 2022 | 3:33 PM

ఉపాధి హామి కూలీలు మట్టి పని చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో తవ్వకాలు జరుపుతుండగా.. ఓ పురాతన కుండ బయటపడింది. ఆ కుండను ఓపెన్ చేయగా...

Nandyal district: ఉపాధి హామి మట్టి పనులు చేస్తుండగా బయటపడిన పురాతన కుండ.. దాన్ని ఓపెన్ చేయగా
Ancient Coins
Follow us on

AP News: నంద్యాల జిల్లా డోన్‌ మండలం(Dhone mandal) చనుగొండ్ల గ్రామం( Chanugondla village)లో జూన్ 1వ తారీఖున ఉపాధి హామి కూలీలు మట్టి పని చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో తవ్వకాలు జరుపుతుండగా.. ఓ పురాతన కుండ బయటపడింది. ఆ కుండను ఓపెన్ చేయగా నిధి కనిపించింది. అందులో పదుల సంఖ్యలో తెల్లటి నాణేలను గుర్తించారు. అవి తెల్లగా ఉండడంతో.. వారు వెండి నాణేలుగా భావించారు. ఒకే కుటుంబానికి చెందిన 15 మంది కూలీలు దొరికిన నాణేలను సూపర్‌వైజర్‌కు అప్పగించకుండా వారి ఇళ్లకు తీసుకెళ్లారు. అయితే ఈ వార్త మండలంలో విపరీతంగా సర్కులేట్ అయ్యింది. వారికి వెండి నాణేలు కుప్పలు తెప్పులుగా దొరికాయని ప్రచారం జరిగింది. సమాచారం అందుకున్న దేవాదాయ శాఖ అధికారులు వెంటనే గ్రామానికి వెళ్లి గ్రామస్తులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కొందరి ఇళ్లకు వెళ్లి అడగ్గా… తొలుత తమకు దొరికింది ఇవే అని 3.66 కిలోల నాణేలను అందజేసినట్లు డోన్ తహశీల్దార్ వై.నరేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. దీంతో రెవెన్యూ అధికారులు, పోలీసు సిబ్బందితో కలిసి మరోసారి గ్రామానికి వెళ్లి పలువురి వద్ద నుంచి 21 కిలోల నాణేలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న నాణేల మొత్తం బరువు 24.66 కిలోలు అని తెలిపారు. వాటిలోని కొన్ని నాణేలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపగా తాజాగా రిపోర్ట్ వచ్చింది. అవి సీసం అచ్చులు అని ల్యాబ్ పరీక్షల్లో తేలింది. వాటిని సబ్ రిజిస్టర్ ఆఫీసులో భద్రపరిచి కలెక్టర్‌కి సమాచారం ఇచ్చామని తహశీల్దార్ వై.నరేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. సీసం కూడా కాస్త వెండి మాదిరిగానే ఉంటుంది. అందుకే ఆ అచ్చులు దొరగ్గానే .. ఇళ్లకు తీసుకెళ్లి దాచుకున్నారు గ్రామస్తులు.

నాగిరెడ్డి, టీవీ9 తెలుగు, ఉమ్మడి కర్నూల్ జిల్లా

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి