మచిలీపట్నం, ఫిబ్రవరి 10: ప్రభుత్వ ఆసుపత్రి పిల్లల విభాగంలో ఇంజెక్షన్ వికటించి ఏడుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సర్వజన ప్రభుత్వ ఆస్పత్రి పిల్లల విభాగంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఆసుపత్రి పిల్లల విభాగంలో మొత్తం 15 మందికి చికిత్స పొందుతున్నారు. వార్డులోని చిన్నారులకు రోజూ మాదిరిగానే ఆసుపత్రి సిబ్బంది శుక్రవారం రాత్రి ఇంజెక్షన్ చేశారు. ఇంజక్షన్ చేసిన అర గంట తర్వాత చిన్నారులకు విపరీతమైన చలి, జ్వరం రావడం గమనించిన వైద్యులు వెంటనే అప్రమత్తమయ్యారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషయమించడంతో ఐసీయూకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అశ్వస్థతకు గురైన పిల్లల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
లక్కూరు ఫిర్కా సొసగెరె గ్రామ పంచాయతీ పరిధిలోని దొమ్మలూరులోకి చెందిన మంజునాథ్, భారతి దంపతులు వృత్తిరిత్యా వ్యవసాయ కూలీలు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె పదో తరగతి పూర్తి చేసి ఇంట్లో ఉంటోంది. రెండో కుమార్తె నందిత (15) లక్కూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. నిత్యం పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తోంది. పక్క గ్రామమైన బరగూరు గ్రామానికి చెందిన నితిన్ బెంగళూరులో బీబీఎంపీలో దినకూలిగా పనిచేస్తుండేవాడు. నిత్యం గ్రామం నుంచి రాకపోకలు సాగించేవాడు. ఈ క్రమంలో నందినిపై కన్నేసిన నితిన్ తనను ప్రేమించాలంటూ వేధించసాగాడు. అయితే ఫిబ్రవరి 7వ తేదీ పాఠశాలకు వెళ్లిన నందిత తిరిగి రాలేదు. అదే రోజు మధ్యాహ్నం నితిన్ తన ఇంటి వద్ద గొంతు కోసుకుని రక్తపు మడుగులోపడి ఉండటాన్ని కుటుంబ సభ్యులు గమనించి, అతన్ని కోలారులోని ఆర్‌ఎల్ జాలప్ప ఆస్పత్రికి తరలించారు. అతను మాట్లాడలేని స్థితిలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మరో వైపు దొమ్మలూరు–బాణారహళ్లి రోడ్డులోని నీలగిరి తోపులో బాలిక నందిత మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహంపై గాయాలు ఉండటం, కుళ్లిపోయి దుర్వాసన వస్తుండటంతో బాలిక హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఘటన జరిగిన స్థలం బెంగళూరు రూరల్ జిల్లా హొసకోటె తాలూకా అనుగొండనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండడంతో అక్కడి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బెంగళూరు వైదేహి ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. నందితను దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డీఎస్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. గ్రామానికి వచ్చి తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.