Andhra News: అబ్బా.. అదృష్టం అంటే ఈ జాలర్‌దే.. ఈ చేప ఎంత రేటు పలికిందో తెలుస్తే..

ఏఓబిలో గిరిజన మత్స్యకారుల పంట పండింది. బలిమెల జలాశయంలో వేటకు వెళ్ళిన జాలర్లకు అదృష్టం తలుపు తట్టింది. చేపల కోసం వేసిన వల ఒక్కసారిగా బరువెక్కింది. ఎంతలాగినా కదల్లేదు.. దీంతో స్థానికుల సమాయంతో బలంగా వలను బయటకు లాగారు.. ఇంకే ముంది వలలో చిక్కిన భారీ చేపను చూసి గంతులేశారు.

Andhra News: అబ్బా.. అదృష్టం అంటే ఈ జాలర్‌దే.. ఈ చేప ఎంత రేటు పలికిందో తెలుస్తే..
Balimela Reservoir

Edited By:

Updated on: Dec 22, 2025 | 9:33 PM

అల్లూరి జిల్లా ఒడిస్సా సరిహద్దులో బలిమెల జలాశయం ఉంది. సీలేరు జల విద్యుత్ కేంద్రానికి నీటి నందించే ఆ జలాశయంలో ఏఓవికి ఆనుకుని ఉన్న గిరిజన మత్స్యకారులు తరచూ చేపల వేట చేస్తూ ఉంటారు. రోజు మాదిరిగానే ఆదివారం కూడా ఒడిస్సా మల్కనగిరి జిల్లా జంత్రి గ్రామానికి చెందిన ఇద్దరు గిరిజన మత్స్యకారులు వేటకు వెళ్లారు. చేపల కోసం వల వేసి చూస్తున్నారు.. ఇంతలో వారు విసిరిన వల బురువెక్కింది. దీంతో వలను లాగేందుకు ప్రయత్నించారు.. అయినా రావట్లేదు.. దీంతో పక్కనున్న వారి సహాంతో వలను గట్టిగా బయటకు లాగారు. ఇంకేముంది.. ఆ వలలో 55 కేజీల భారీ చేప కనిపించింది. దీంతో చేపను పట్టుకొని ఒడ్డుకు చేశారు ఆ మత్స్యకారులు.

సధారణంగా ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులోని బలిమెల రిజర్వాయర్లో రకరకాల చేపటు పట్టుబడుతుంటాయి. చిన్న చేపల నుంచి 20 కిలోల వరకు చేపలు పడతాయి. ఒక్కోసారి భారీ చేపలు కూడా వలకు చిక్కుతూ ఉంటాయి. వాటిలో పెద్ద తల ఉండే చేపను దోబీ చేప అని పిలుస్తారు మత్స్యకారులు. ఈసారి మాత్రం ఏకంగా 55 కిలోల ఇంత పెద్ద చేప దొరికింది. దీంతో మత్స్యకారులు ఎగిరి గంతేశారు. చేపను కర్రకు కట్టుకొని భుజాలపై మోస్తూ తీసుకొచ్చారు. ఆ చేపను చూసేందుకు కొందరు.. కొనేందుకు మరికొందరు పోటీపడ్డారు. దీంతో ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. చివరికి ఈ చేప దాదుపుగా పదిహేను వేల రూపాయల వరకు ధర పలికినట్టు మత్స్యకారులు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.