ప్రకాశం జిల్లా చీమకుర్తిలో దారుణం.. అభంశుభం తెలియని చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడు…
మహిళలపై అఘాయిత్యాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా కామాంధులు బేఫికర్ అంటున్నారు. కన్ను మిన్ను కానక..
మహిళలపై అఘాయిత్యాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా కామాంధులు బేఫికర్ అంటున్నారు. కన్ను మిన్ను కానక.. చిన్నా, పెద్ద, ముసలి, ముతక తేడా లేకుండా మహిళలపై పశువుల్లా విరుచుకుపడుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలోని చీమకుర్తిలో దారుణం చోటు చేసుకుంది. అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై 28 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత కుటుంబానికి సన్నిహితంగా ఉంటూనే చిన్నారిని కాటు వేశాడు ఆ కామాంధుడు. మూడు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకోగా.. చిన్నారి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు పారిపోయిన నిందితుడి కోసం గాలించారు. ఎట్టకేలకు నిందితుడు దొరకడంతో నడిరోడ్డుపై అతన్ని చితకబాదారు. విషయం తెలుసుకున్న స్థానికులు సైతం ఆ కామాంధుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి.. వారికి అప్పగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.