
Palnadu Lorry Accident: ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ బోల్తా పడిన ఘటనలో ముగ్గురు కూలీలు దుర్మరణం చెందారు. ఈ ఘటన నకరికల్లు మండలం శాంతి నగర్ వద్ద చోటచేసుకుంది. శాంతినగర్ వద్ద ప్రమాదవశాత్తు లారీ బోల్తా పడింది. లారీలో ఉన్న నాపరాళ్ళు కూలీల మీద పడడటంతో ముగ్గురు మృతి చెందారు. మాచర్ల నుంచి ఇతర రాష్ట్రాలకు నాపరాళ్ళు తరలించే క్రమంలో మార్గ మధ్యలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతి చెందిన ముగ్గురు కూలీలను మాచర్లలోని పసర్లపాడుకు చెందిన అమారేసు శ్రీను, దొడ్డ భాస్కరరావు, రమావత్ మునినాయక్‌గా గుర్తించారు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ అక్కడినుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..