మినీ హుదూద్..! అంతా నిమిషాల్లోనే జరిగింది.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే గజ గజే..
ఏపీలో ఒక్కసారిగా మారిన వాతావరణం బీభత్సం సృష్టించింది. పాయకరావుపేట నియోజకవర్గంలో భారీ ఈదురుగాలులు, వర్షం కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగి.. పంటలకు భారీ నష్టం వాటిల్లింది. గంటపాటు కొనసాగిన గాలివాన హుదూద్ తుఫాన్‌ను తలపించిందంటూ స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరి చెట్లు కూలిపోవడంతో ఇద్దరు కూలీలు మృతి చెందగా.. మరో రైతు చెట్టు కిందపడి ప్రాణాలు కోల్పోయాడు.

రోజంతా బానుడు ప్రతాపం చూపించాడు.. వేడి ఉక్కపోతతో జనాలు అల్లాడిపోయారు.. మధ్యాహ్నం తర్వాత వాతావరణం మారింది. దట్టంగా మేఘాలు కమ్ముకోవడంతో హమ్మయ్య అనుకున్నారు అంతా.. కాస్త చల్లబడడంతో సేద తీరారు. కాసేపటికే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారీ ఈదురుగాలులు.. ఆ వెంటే వర్షం. దీంతో జనం అల్లాడి పోయారు. చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. శనివారం సాయంత్రం జరిగిన ఈ బీభత్సం.. హుధూద్ తుఫానును గుర్తుకు తెచ్చుకునేంత పరిస్థితి ఎదురైంది. గంటపాటు సాగిన ఈ గాలి వాన తర్వాత.. చూస్తే.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.. ఆస్తి నష్టం కూడా సంభవించింది. దీంతో.. మినీ హుదూద్ అన్న చర్చ మొదలయింది.
పాయకరావుపేట నియోజకవర్గం లో గాలి వాన సృష్టించిన బీభత్సం ముగ్గురు ప్రాణాలు తీయగా.. పంటలు నష్టపోయాయి. విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. నష్టాన్ని అంచనా వేస్తున్నారు అధికారులు. ఈదురు గాలుల ధాటికి పాయకరావుపేట నియోజకవర్గంలో రెండు వేరు వేరు చోట్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పాయకరావుపేట మం సత్యవరంలో కొబ్బరి చెట్టు కూలింది. దీంతో తమలపాకు తోటల్లో పనిచేస్తున్న ఇద్దరు కూలీలు మృతి చెందారు. మృతులు అరట్లకోట గ్రామనికి చెందిన దొరబాబు, శంకరరావుగా గుర్తించారు. నక్కపల్లి మండలం చినరాంబద్రపురంలో మేకల పాక పై చెట్టు పడి రంగయ్య అనే రైతు మృతి చెందాడు. ఈదురు గాలులు వాన బీభత్సానికి ముగ్గురు మృతి చెందడంతో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు హోం మంత్రి అనిత. ఈదురుగాలులతో వర్షాలు పడే సమయంలో చెట్లు, విద్యుత్ పోల్స్, హోర్డింగ్స్ వద్ద ఉండొద్దని.. తీవ్ర ఎండలతోపాటు, పిడుగులతో కూడిన వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు హోంమంత్రి అనిత..
వీడియో చూడండి..
పాయకరావుపేట నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లో ఈదురుగాలతో కూడిన వర్షనికి చాలా చోట్ల పంటలు నష్టపోయాయి. గాలుల దాటికి మామిడి కొబ్బరి చెట్లు వేళ్ళతో సహా ఒరిగిపోయాయి. విద్యుత్ స్తంభాలు కూడా పలుచోట్ల నేలకొరిగాయి. ముకుంద రాజుపేట, దోసలపాడు, జగన్నాధపురం, గొడిచర్ల, ప్రాంతాల్లో.. తాటాకు పెంకుటిల్లు రేకుల షెడ్డు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల మామిడి పంట దెబ్బతింది. చీడిక కొత్తూరు, డొంకాడ, చీడిక ప్రాంతాల్లో అరటి బొప్పాయి చెట్లు నేలవాలాయి. ఆయా ప్రాంతాల్లో నష్టని అంచనా వేసే పని ప్రారంభించారు అధికారులు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
