Watch Video: దారుణం.. ప్రేమించిన పిల్ల దక్కలేదనీ.. సెల్పీ వీడియో తీసుకుని యువకుడు సూసైడ్‌!

కుడేరు మండలం గొట్టుకూరు సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని అనిల్ కుమార్ (27) యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన యువతి వదిలేసిందని, ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరని వీడియోలో తెలిపాడు. అమ్మా, నాన్నలు బాగుండాలని తన వద్ద ఉన్న మొబైల్‌ ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అనంతరం అక్కడే ఉన్న చెట్టుకు..

అనంతపురం, ఆగస్ట్‌ 30: ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని ఓ యువకుడు నిండు ప్రాణాలు తీసుకున్నాడు. చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసుకొని తన గోడు వెల్లడించాడు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా కుడేరు మండలం గొట్టుకూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కుడేరు మండలం గొట్టుకూరు సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని అనిల్ కుమార్ (27) యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన యువతి వదిలేసిందని, ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరని వీడియోలో తెలిపాడు. అమ్మా, నాన్నలు బాగుండాలని తన వద్ద ఉన్న మొబైల్‌ ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అనంతరం అక్కడే ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని అనిల్ ఆత్మహత్య చేసుకున్నాడు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అనిల్ కుమార్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమత్తం తరలించారు. మృతుడిని కనగానపల్లి మండలం గుంతపల్లి గ్రామానికి చెందిన అనిల్ కుమార్‌గా గుర్తించారు. మృతుడి వద్ద ఉన్న మొబైల్‌లోని వీడియో ఆధారంగా ప్రేమించిన యువతి వదిలేసిందని సెల్ఫీ వీడియో తీసుకొని యువకుడు సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.