Andhra Pradesh: పెళ్లి భోజనం వికటించి ఆస్పత్రిలో చేరిన అతిథులు.. గ్రామంలోనే మెడికల్ క్యాంప్ ఏర్పాటు..

Andhra Pradesh: ఉమ్మడి కర్నూల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి భోజనం వికటించడంతో శుభకార్యానికి వచ్చిన అతిథులు అసుపత్రి పాలయ్యారు. దాదాపు 20 మందికి అస్వస్థతకు గురవడంతో మెడికల్ క్యాంప్‌ను ఏర్పాటు...

Andhra Pradesh: పెళ్లి భోజనం వికటించి ఆస్పత్రిలో చేరిన అతిథులు.. గ్రామంలోనే మెడికల్ క్యాంప్ ఏర్పాటు..
Food Poisoning In Marraige Ceremony

Updated on: May 26, 2023 | 10:37 AM

Andhra Pradesh: ఉమ్మడి కర్నూల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి భోజనం వికటించడంతో శుభకార్యానికి వచ్చిన అతిథులు అసుపత్రి పాలయ్యారు. దాదాపు 20 మందికి అస్వస్థతకు గురవడంతో మెడికల్ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. అసలేం జరిగిందేంటే.. నంద్యాల జిల్లా వెలుగోడు మండలం గుంతకందాల గ్రామంలో పెళ్లికి  వచ్చిన అతిథులు కలుషితాహారం తినడం వల్ల 20 మంది అతిథులకు ఫుడ్ పాయిజనింగ్ అయింది.

ఆ భోజనం తిన్న తర్వాత వారికి నుంచి వాంతులు, విరోచనాలు ప్రారంభమయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న అధికారులు గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. బాధితులను అసిస్టెంట్ డీఎంహెచ్ఓ కాంతారావు నాయక్ , వైద్యులు వంశీకృష్ణ ,హెల్త్ సూపర్ వైజర్ శ్రీనివాసులు పర్యవేక్షిస్తున్నారు. అలాగే వెలుగోడు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితులను జిల్లా హెల్త్ ఆఫీసర్(DMHO) వెంకటరమణ పరామర్శించారు.

కాగా, భోజనం చేయడం వల్ల ఇలా జరిగి ఉంటుందా, లేదా బోరింగ్ నీళ్ల వల్ల భోజనం కలుషితంగా మారిందా అనే కోణాల్లో అధికారులు విచారణ జరుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..