AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1992 నాటి కేసు.. 34 ఏళ్ల తర్వాత నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎలా పట్టుకున్నారంటే?

అది 1992 సంవత్సరం.. ఓ కానిస్టేబుల్ ప్రజలతో కలసి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు. ఇంతలో బస్సులును అడ్డగించిన కొందరు మావోయిస్టులు లోపనికి లొచరబ్బారు. ఆ గ్యాంగ్‌లోని ఓ వ్యక్తి తన దగ్గర ఉన్న తుపాకీతో బస్సులో ఉన్న వ్యక్తి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. దాదాపు 34 ఏళ్ల దర్యాప్తు తర్వాత ఆ కాల్పులు జరిపిన వ్యక్తి పోలీసులు అరెస్ట్ చేశారు.

1992 నాటి కేసు.. 34 ఏళ్ల తర్వాత నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎలా పట్టుకున్నారంటే?
Maoist Subbanna Arrest
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Aug 22, 2026 | 10:37 AM

Share

దాదాపు 34 ఏళ్ల తర్వాత నంద్యాల జిల్లా ఆత్మకూరు పోలీసులు ఓ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మావోయిస్ట్‌ను అరెస్ట్ చేశారు. సుమారు మూడు దశాబ్దాల క్రితం పోలీస్ కానిస్టేబుల్ అబ్దుల్ కరీంను హత్య చేసిన కేసులో మాజీ మావోయిస్టు మాడుగుల సుబ్బన్నను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 1992లో వెలుగోడు–నల్లకాల్వ మధ్య ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న కానిస్టేబుల్ అబ్దుల్ కరీంను పీపుల్స్ వార్ పార్టీకి చెందిన సాయుధులు తుపాకీతో కాల్చి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేసులో నిందితుడిగా ఉన్న సుబ్బన్న.. అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా సుమారు 34 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నంద్యాల జిల్లా పాములపాడు మండలం వేంపెంట గ్రామానికి చెందిన మాడుగుల సుబ్బన్న.. అలియాస్ సోమన్న, అలియాస్ గుంటూరు గద్దర్‌గా పిలువబడేవాడని పోలీసులు తెలిపారు.1990వ దశకంలో పీపుల్స్ వార్ పార్టీలో సుబ్బన్న కీలక వ్యక్తిగా పనిచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ హత్య కేసును ఛేదించిన ఆత్మకూరు పోలీసులు.. దాదాపు 34 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలో ఉన్న సుబ్బన్నను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఆ దాడికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us