RBI: పాత చెక్ బుక్‌లు ఇకపై చెల్లవ్.. ఆర్బీఐ షాకింగ్ డెసిషన్.. కొత్త బుక్స్ అమల్లోకి..
బ్యాంకింగ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. కొత్త చెక్ బుక్‌లు మీరు ఎక్కువగా ఉపయోగిస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే. ఆర్బీఐ పాత చెక్ బుక్‌ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 వరకు మాత్రమే పాత చెక్ బుక్‌లు చెల్లుబాటు అవుతాయి.

బ్యాంకింగ్ మోసాలను అరికట్టేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. చెక్ బుక్ నిబంధనల్లో భారీ మార్పులు చేసింది. కొత్త చెక్ బుక్స్ జారీ విధానాన్ని ప్రకటించింది. కొత్త చెక్ బుక్‌లలో అనేక భద్రతా ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఆల్పా న్యూమరిక్ కోడ్‌లతో పాటు మరిన్ని సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి. డిసెంబర్ 31,2026 తర్వాత పాత చెక్ బుక్‌లు ఇక చెల్లవని ఆర్బీఐ తెలిపింది. ఖాతాదారులందరూ కొత్త చెక్ బుక్‌లను తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. బ్యాంకింగ్ మోసాలకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఖాతాదారులు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొంది.
జనవరి 1 నుంచి కొత్త చెక్‌బుక్స్
ప్రస్తుతం ఉన్న చెక్ బుక్‌లలో ప్రతీ చెక్ కింద ఒక చెక్ నెంబర్, MICR కోడ్ కేవలం అంకెల్లో మాత్రమే ఉంటున్నాయి. కానీ ఇప్పుడు ఇందులో మార్పులు చేయనున్నారు. కొత్త చెక్ బుక్‌లలో అంకెలతో పాటు ప్రత్యేక ఆక్షరాలు కూడా ఉంటాయి. అలాగే ఆల్పాబెట్‌లను కూడా ఉపయోగించనున్నారు. అలాగే కొత్తగా వచ్చే చెక్ బుక్‌లు ప్రత్యేక వాటర్ మార్క్, యూపీ కాంతి కింద కనిపించే అదృశ్య సిరా, మైక్రో ప్రింటింగ్ వంటి అదనపు ఫీచర్లను కలిగి ఉంటుంది. కంటితో వీటిన కాపీ చేయడం దాదాపు అసాధ్యమని ఆర్బీఐ చెబుతోంది. అలాగే రిజర్వ్ బ్యాంక్ పాజిటివ్ పే సిస్టమ్‌తో కలిసి ఉంటాయి. డిసెంబర్ 31 వరకు మాత్రమే ప్రస్తుతం ఉన్న చెక్కులు చెల్లుబాటు అవుతాయని, 2027 జనవరి 1వ తేదీ నుంచి కొత్త చెక్ బుక్‌లను మాత్రమే వాడాల్సి ఉంటుందని తెలిపింది. ఇప్పటికే బ్యాంకులు కొత్త చెక్ బుక్‌లను తమ ఖాతాదారులకు జారీ చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులు డిసెంబర్ 31లోపు ఆల్పా న్యూమరిక్ కోడ్‌లతో కూడిన చెక్ బుక్‌లను జారీ చేసేందుకు సిద్దమవుతున్నాయి.
ఫీచర్లు ఇవే..
డిసెంబర్ 31 తర్వాత పాత చెక్ బుక్ నుంచి రూ.50 వేలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాలను బ్యాంకులు స్వీకరించవు. అయితే పాత చెక్ బుక్‌లను తారుమారు చేయడం, నకిలీ చేయడం చాలా సులభం. కొత్త వాటిల్లో ఉండే కోడ్‌లు, భద్రతా ఫీచర్ల వల్ల నకిలీకి సృష్టించలేరు. డిజిటల్ స్కానింగ్, క్లియరింగ్‌కు గతంలో సమయం పట్టేది. కానీ ఇప్పుడు ఆటోమేటెడ్ స్కానింగ్ కారణంగా వేగంగా క్లియర్ అవుతుంది. యూపీఐ వచ్చిన తర్వాత రూ.10, రూ.20 నగదు పంపేందుకు కూడా ఉపయోగిస్తున్నారు. కేవలం పెద్ద మొత్తంలో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలంటేనే చెక్ బుక్ ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఈ మార్పులతో చెక్ బుక్ లావాదేవీల్లో పారదర్శకత లభించనుంది.
