AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Irumudi Movie: రవితేజ ‘ఇరుముడి’ సినిమాను రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా? మంచి మూవీ మిస్ చేసుకున్నాడే!

మాస్ మహరాజా రవితేజ నటించిన ఇరుముడి సినిమా శుక్రవారం (ఆగస్టు 21) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాకు రవన్న ఫస్ట్ ఛాయిస్ కాదట. అతని కంటే ముందు ఓ స్టార్ హీరోకు ఈ సినిమా కథ వినిపించారట మేకర్స్.

Irumudi Movie: రవితేజ 'ఇరుముడి' సినిమాను రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా? మంచి మూవీ మిస్ చేసుకున్నాడే!
Irumudi Movie
Basha Shek
|

Updated on: Aug 22, 2026 | 10:26 AM

Share

ఇప్పటివరకు తన కెరీర్ లో ఎక్కువగా మాస్ సినిమాలు చేసిన రవితేజ ఈసారి ఒక డివోషనల్ మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ డివోషనల్ మూవీ ఇరుముడి. గతంలో మజిలి, నిన్నుకోరి వంటి ప్రేమకథా చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించింది. టీజర్స్, సాంగ్స్, ట్రైలర్ తోనే పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసిన ఇరుముడి సినిమా శుక్రవారం (ఆగస్టు 21) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రజెంట్ సినిమా ట్రెండ్ అయిన సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీకి డివోషనల్ టచ్ ఇచ్చి ఈ సినిమాను తెరకెక్కించాడు శివ నిర్వాణ. అందుకు తగ్టట్టే థియేటర్లలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. రవితేజకు గ్రేట్ కమ్ బ్యాక్ వచ్చినట్టేనని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అయితే ఇరుముడి సినిమా రిలీజ్ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వార్త వైరల్ గా మారింది. అదేంటంటే.. ఇరుముడి సినిమాకు రవితేజ ఫస్ట్ ఛాయిస్ కాదట. ఆయన కంటే ముందు మరో హీరోను ఈ మూవీ సంప్రదించారట మేకర్స్. అయితే ఆ హీరో పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో రవన్నను తీసుకున్నారట.

దర్శకుడు శివ నిర్వాణ ఇరుముడి కథను మొదట నాగచైతన్యకు వినిపించారట. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన మజిలీ సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఖుషి సినిమా తర్వాత శివ మొదట‌ నాగ చైత‌న్య‌ను క‌లిసి ఈ ఇరుముడి స్క్రిప్ట్ వినిపించాడ‌ట. అతనికి కూడా ఈ కథ తెగ నచ్చేసిందట. అయితే అప్పటికే నాగ చైతన్య ఇతర సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడట. దీంతో ఇరుముడి సినిమాపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట. ఆ తర్వాతే మాస్ మహారాజ రవితేజ లైన్లోకి వచ్చాడట. ఇందులో నిజమెంతుంతో తెలియదు కానీ ఇరుముడి రిలీజ్ నేపథ్యంలో ఇప్పుడీ విషయం నెట్టింట బాగా వైరలవుతోంది. నాగ చైతన్య మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడేమోనని చాలా మంది సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఇరుముడి మల్లెపూల పల్లకి సాంగ్..

ఇవి కూడా చదవండి

ఇరుముడి సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రోహిత్ సెంచరీ సెలబ్రేషన్స్ వెనుక సీక్రెట్ ఇదే..?
రోహిత్ సెంచరీ సెలబ్రేషన్స్ వెనుక సీక్రెట్ ఇదే..?
13 ఏళ్ల తర్వాత ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..
13 ఏళ్ల తర్వాత ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..
నొప్పి, జ్వరానికి సొంతంగా మందులు వేసుకుంటున్నారా? CDSCO హెచ్చరిక
నొప్పి, జ్వరానికి సొంతంగా మందులు వేసుకుంటున్నారా? CDSCO హెచ్చరిక
స్కూటీ బ్రేక్ హ్యాండిల్ వద్ద ఉండే ఆ చిన్న లివర్ దేనికో తెలుసా?
స్కూటీ బ్రేక్ హ్యాండిల్ వద్ద ఉండే ఆ చిన్న లివర్ దేనికో తెలుసా?
ఇన్‌స్టా రీల్‌తో మొదలై టెలిగ్రామ్ ట్రైనింగ్‌తో జోరుగా దందా!
ఇన్‌స్టా రీల్‌తో మొదలై టెలిగ్రామ్ ట్రైనింగ్‌తో జోరుగా దందా!
చక్కెర తినడం పూర్తిగా ఆపేస్తే శరీరంలో ఏం జరుగుతుంది? నిపుణుల సూచన
చక్కెర తినడం పూర్తిగా ఆపేస్తే శరీరంలో ఏం జరుగుతుంది? నిపుణుల సూచన
విరిగిన ఎముకలకు మేలు చేసే నల్ల కారం పొడి.. ఇడ్లీ, దోసెల్లోకి కూడా
విరిగిన ఎముకలకు మేలు చేసే నల్ల కారం పొడి.. ఇడ్లీ, దోసెల్లోకి కూడా
చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు.. హాకీలో సౌత్ కొరియా ఖేల్ ఖతం..
చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు.. హాకీలో సౌత్ కొరియా ఖేల్ ఖతం..
టెంప్టింగ్ ధరతో మార్కెట్లోకి రెనాల్ట్ ట్రైబర్
టెంప్టింగ్ ధరతో మార్కెట్లోకి రెనాల్ట్ ట్రైబర్
వీర భారత పైలట్‌ను ప్రశంసించిన ప్రధాని మోదీ!
వీర భారత పైలట్‌ను ప్రశంసించిన ప్రధాని మోదీ!