యాదాద్రి భువనగిరి జిల్లా కాప్రాయపల్లికి చెందిన కొంగర భవాని.. కుటుంబ కలహాలు, భర్త వేధింపులు నేపథ్యంలో 18 నెలల కుమారుడు విజయ్‌కుమార్‌తో కలిసి రైలు ఎక్కి విశాఖ వరకు వచ్చేసింది. రైలు దిగిన తర్వాత ప్లాట్‌ఫార్మ్ నెంబర్ 8లో కొడుకుతో నిద్రించింది ఆ తల్లి… కాసేపటికి మేలుకొని చూస్తే బాలుడు మాయం అయ్యాడు..చుట్టుపక్కల వెతికిన కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది..స్టేషన్ మొత్తం గాలించినా ఫలితం లభించలేదు.
అయితే ఆమె నిద్రపోవడానికి కొంత సమయం ముందు..ఓ జంట తనతో మాట్లాడినట్లు విచారణలో చెప్పింది భవాని..వాళ్లే బాలుడును ఎత్తుకొని వెళ్లి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది..బాలుడు నీలిరంగు నైట్ ప్యాంటు నలుపు రంగు స్లీవ్ లెస్ బనియన్ ధరించాడని ఆమె చెప్పింది. ఐతే భవాని ఏడు నెలల గర్భిణీ కావడంతో ఆసుపత్రికి తరలించి…కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు పోలీసులు..
ఇక కిడ్నాప్ కేసు నమోదు చేసి బాలుడు, నిందితుల కోసం ఆరు ప్రత్యేక బృందాలుగా గాలిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్‌లో నాణ్యత లేకపోవడం పైగా, సంఘటన జరిగిన ప్రాంతంలో కెమెరాలు లేకపోవడం దర్యాప్తులో ఆటంకంగా మారింది. తల్లికి టీలో మత్తుమందు ఇచ్చి ఆపై బాలుడిని ఎత్తుకెళ్లినట్టు అనుమానిస్తున్నారు. అదృశ్యమైన చిన్నారి కోసం కంటతడి పెడుతుంది ఆ తల్లి. నా బాబు పాలు కోసం ఏడుస్తుంటాడని..ఎక్కడున్నాడో ఏమయ్యాడో ఎలా ఉన్నాడో తెలియడం లేదంటున్నారు తల్లి భవాని. తన బాబును తన వద్దకు చేర్చాలని కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది భవాని.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం