Andhra: ఎవురు మేడం మీరు ఇంత ట్యాలెంటెడ్ ఉన్నారు.. ఈ బిల్డింగ్ చూసి ఆశ్చర్యపోయన డిప్యూటీ స్పీకర్

పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలంలో 16 గజాల స్థలంలో నిర్మించిన మూడు అంతస్తుల భవనం ఆసక్తికరంగా మారింది. అనుమతులు లేకుండా నిర్మించడంతో.. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆగ్రహంతో భవనాన్ని కూల్చివేయాలని ఆదేశించారు. గ్రామ కార్యదర్శి ఈ నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు వెల్లడించారు.

Andhra: ఎవురు మేడం మీరు ఇంత ట్యాలెంటెడ్ ఉన్నారు.. ఈ బిల్డింగ్ చూసి ఆశ్చర్యపోయన డిప్యూటీ స్పీకర్
Narrow Building

Edited By:

Updated on: Jun 12, 2025 | 12:49 PM

మనం చీమల పుట్టలు చూసినపుడు ఆశ్చర్యపోతాము. భూమి లోపల అంట చిన్న చిన్న జీవులు ఎలా మట్టిని పెకలించి వాటిని పుట్టగా మార్చుతాయో తెలుసుకుంటే అద్భుతమైన ఇంజినీరింగ్ ప్రతిభ కనిపిస్తుంది. పక్షులు సైతం చిన్న చిన్న గడ్డి పూచలను అల్లి అందమైన గూళ్ళు కట్టుకుంటాయి. చిన్నపాటి ప్రకృతి  వైపరీత్యాలకు సైతం ఇవి తట్టుకుంటాయి. మరి వీటిని ఆదర్శంగా తీసుకుందో ఏమో ఒక మహిళ
ఏకంగా 16 గజాల స్థలంలో 3 అంతస్తుల భవనం నిర్మించాడు. అతడి ప్రతిభకు మెచ్చుకోవలసిందే కానీ ఆ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు తీసుకోకపోవటంతో నేరుగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు దాన్ని కూల్చేయాలని ఆదేశించారు. తొలుత ఈ నిర్మాణాన్ని చూసి ఆశ్చర్యపోయిన ఆయన వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకువాలని ఆదేశాలు జారీ చేశారు.

వివరాల్లోకి వెళితే పదహారు గజాల స్థలంలో బిల్డింగ్ రెండు అంతస్తులు, ఆపైన రేకులలో మరో ఫ్లోర్ ఏర్పాటు చేశారు. అంత చిన్న స్థలంలో ఆ ఇంటి నిర్మాణం చూసి విస్తుపోయారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అనుమతులు లేకుండా నిర్మించారని తెలిసి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులోని మంగయ్య చెరువు సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా పదహారు గజాల స్థలంలో నిర్మిస్తున్న భవనాన్ని కూల్చేయాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అధికారులను ఆదేశించారు.  పాలకోడేరులో సీసీ రోడ్ల ప్రారంభోత్సవా నికి విచ్చేసిన ఆయన పక్కనే నిర్మిస్తున్న భవనాన్ని చూసి అధికారులను ప్రశ్నించారు. గ్రామకార్యదర్శి గోపి సమాధానమిస్తూ ఈ భవనానికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, అయినా గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగిని చంద్రావతి నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని తెలిపారు. అనుమతులు లేకుండా బిల్డింగ్ నిర్మిస్తుంటే మీరేం చేస్తున్నారని రఘురామ మండిపడ్డారు. ఈ బిల్డింగును వెంటనే కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు.

బిల్డింగ్ వీడియో దిగునవ చూడండి…