అధికారంలోకి రాగానే తక్కువ ధరకు నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెస్తామని కూటమి పార్టీలు హామి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీఎంగా ఛార్జ్ తీసకోగానే.. చంద్రబాబు.. ఆ దిశగా తీవ్ర కసరత్తు చేసి నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టారు. అయితే నాణ్యమైన మద్యం అందుబాటులోకి వచ్చినప్పటికీ.. ధరలు మాత్రం పెద్దగా తగ్గలేదని మందుబాబులు చిన్నబుచ్చున్నారు. వారికి లేటెస్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే.. ప్రభుత్వం చర్చలు అనంతరం సుమారు 11 మద్యం తయారీ కంపెనీలు బేసిక్ ప్రైస్‌ను తగ్గించేశాయి. దీంతో సదరు కంపెనీల నుంచి రాష్ట్ర బెవరేజస్ సంస్థ లిక్కర్ కొనే రేటు తగ్గింది. ఈ కారణంగా వివిధ బ్రాండ్ల మద్యం ఒక్కో క్వార్టర్ ధర MRPపై రూ.30 వరకూ తగ్గుతోందట. ఇది మద్యం ప్రియులకు ఊరటనిచ్చే విషయంగానే చెప్పాలి.
ఇక లిక్కర్ రేట్స్ విషయంలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా ఎమ్మార్పీ కంటే ఒక్క రూపాయి ఎక్కువ ధరకు అమ్మినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలానే బెల్ట్ షాపులకు మద్యం అమ్మితే.. ఆ షాపులకు మొదటి తప్పు కింద రూ.5 లక్షలు ఫైన్ వేయనున్నట్లు తెలిపారు. రెండోసారి అదే తప్పు రిపీట్ చేస్తే షాపు లైసెన్స్ క్యాన్సిల్ అవుతుందని క్లియర్ కట్‌గా చెప్పేశారు. ప్రతి షాపు దగ్గర ధరల పట్టిక బోర్డులు ఉండాలని సూచించారు. ఆకస్మిక తనిఖీలతో పాటుగా.. టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయాలని కూడా సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. షాపుల ఓనర్లపై ఎవరు కమిషన్స్ కోసం ఒత్తిడి చేసినా ఊరుకోనని చంద్రబాబు పార్టీ లీడర్లకు కూడా వార్నింగ్ ఇచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..