AP News: ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. 10 మందికి తీవ్ర గాయాలు.. ముగ్గురు పరిస్థితి..

|

Apr 26, 2022 | 7:24 AM

Nellore Road Accident: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురు పరిస్థితి

AP News: ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. 10 మందికి తీవ్ర గాయాలు.. ముగ్గురు పరిస్థితి..
Road Accident
Follow us on

Nellore Road Accident: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ రోడ్డు ప్రమాదంలో నెల్లూరు మర్రిపాడు (marripadu) మండలం కండ్రిక వద్ద మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బళ్లారి నుంచి నెల్లూరు వస్తున్న ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు.. కండ్రిక వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో స్థానికులు అక్కడికి చేరుకొని అద్దాలు పగులగొట్టి ప్రయాణికులను కాపాడారు. ప్రమాద సమయంలో బస్సులో 26 ప్రయాణికులు ఉన్నారు.

స్థానికుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బళ్లారి నుంచి నెల్లూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని.. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. కాగా.. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Also Read:

Tirumala News: తిరుమల క్షేత్రంలో సినిమా పాటల ప్రసారంపై టీటీటీ సీరియస్‌.. సిబ్బందిపై చర్యలు

Bonda Uma: వాసిరెడ్డి పద్మ మీద మరోసారి తీవ్ర పదజలంతో విరుచుకుపడిన బోండా ఉమా