NTR District: వీసా వచ్చిందన్న సంతోషం.. ఫ్రెండ్స్ అందర్నీ పిలిచి పార్టీ.. కానీ..
అతను విదేశానికి వెళ్తున్నాడు. చివరిగా అందరికీ పార్టీ ఇద్దామనుకున్నాడు. ఒక ప్లేస్ ఫిక్స్ చేశాడు. అందరూ ఎంజాయ్ చేసి.. రిటన్ వస్తుండగా ప్రమాదం వెంటాడింది.
లండన్ వెళ్లేందుకు వీసా వచ్చిందన్న సంతోషం.. ఫ్రెండ్స్ అందర్నీ పెనుగంచిప్రోలుకు తీసుకెళ్లి పార్టీ ఇచ్చాడు. ఆపై అందరూ కార్లలో బయలురేరారు. కానీ ర్యాష్ డ్రైవింగ్‌తో ఒకరి ప్రాణం బలైపోయింది. తీవ్ర గాయాలతో మిగతావాళ్లు ఆస్పత్రి బెడ్‌పై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. తాగి రోడ్డెక్కకండి మొర్రో అని ఎవరు ఎంతగా మొత్తుకుంటున్నా కొందరు పట్టించుకోవడం లేదు. స్పీడ్ థ్రిల్స్.. బట్ కిల్స్.. ఎన్టీయార్ జిల్లా ఐతవరం దగ్గర జరిగింది ఇదే. మద్యం మత్తులో కారు స్టీరింగ్ పట్టుకున్న యువకులు.. ర్యాష్ డ్రైవింగ్‌తో ప్రమాదానికి గురయ్యారు. కారు కంట్రోల్ తప్పి విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై పల్టీలు కొట్టింది. మరో బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న విజయవాడకు చెందిన మహబుల్లా మృతి చెందాడు. మిగతా వాళ్లు తీవ్రంగా గాయపడ్డాడు.
కారును చూస్తే తెలుస్తుంది.. ఏ రేంజ్‌లో యాక్సిడెంట్ జరిగిందో. ప్రమాద స్థలంలో మద్యం బాటిల్‌ను కూడా కనిపించింది. ఫ్రెండ్స్‌లో ఒకరికి లండన్ వెళ్లేందుకు వీసా రావడంతో పెనుగంచిప్రోలుకు వెళ్లి పార్టీ చేసుకున్నారు. అందులో కొంతమంది మద్యం సేవించారు. అదే జోష్‌తో రోడ్డెక్కారు. మద్యం మత్తులో స్టీరింగ్ అదుపు తప్పింది. అందరి జీవితాలను తలకిందులయ్యేలా చేసింది. ఒకరు చనిపోగా.. గాయపడ్డవారిని నందిగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంతో విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై భీతావహ వాతావరణం కనిపించింది. ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచిపోయింది. క్రేన్ సాయంతో కారును పక్కకు తీసిన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..