అమెరికాలో అదే వరస, నల్లజాతీయుడి కాల్చివేత, ఉద్రిక్తత

| Edited By: Anil kumar poka

Aug 26, 2020 | 10:29 AM

అమెరికాలో నల్లజాతీయులపై అణచివేత కొనసాగుతోంది. విస్ కాన్సిన్ లోని కెనోషా నగరంలో ఓ నల్లజాతీయుడిని నేషనల్ గార్డులు కాల్చి చంపారు.

అమెరికాలో అదే వరస, నల్లజాతీయుడి కాల్చివేత, ఉద్రిక్తత
Follow us on

అమెరికాలో నల్లజాతీయులపై అణచివేత కొనసాగుతోంది. విస్ కాన్సిన్ లోని కెనోషా నగరంలో ఓ నల్లజాతీయుడిని నేషనల్ గార్డులు కాల్చి చంపారు. దీంతో సిటీలో పెద్దఎత్తున అల్లర్లు, ఘర్షణలు చెలరేగాయి. నిరసనకారులు పోలీసులతోనే ఘర్షణకు దిగారు. షాపింగ్ మాల్స్ ని దోచుకున్నారు. అధికారులు విధించిన కర్ఫ్యూను ఉల్లంఘించి వీధుల్లో స్వైర విహారం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చెందుకు విస్ కాన్సిన్ గవర్నర్ టోనీ ఎవర్స్ అత్యవసర పరిస్థితిని విధించారు. గతంలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ ని పోలీసులు హత్య చేసిన అనంతరం మళ్ళీ నల్లజాతీయులపై ఇలా కాల్చివేత, అణచివేత జరగడం ఇదే మొదటిసారి.