అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన భారత సంతతికి చెందిన మహిళ కమలా హారిస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఇంటితో దాదాపు 17 ఏళ్లుగా ఉన్న బంధాన్ని తెంచుకోనున్నారు. వివరాల్లోకి వెళితే.. శాన్‌ఫ్రాన్సిస్కో సౌతాఫ్ మార్కెట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌పై అంతస్తులో ఉన్న తన ఇంటిని కమలా హారిస్ అమ్మకానికి పెట్టినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనాన్ని వెలువరించింది. అన్ని విధాలుగా సదుపాయాలున్న ఈ భవనాన్ని 7,99,000 డాలర్లకు అమ్మాలని కమలా హారిస్ నిర్ణయించుకున్నట్లు పేర్కొంది.
కాగా, కమలా హారిస్ ఆ ఇంటిని 2004లో కొనుగోలు చేశారు. అందులోనే దాదాపు 17 ఏళ్ల పాటు నివసించారు. ఆ సమయంలో ఆమె శాన్‌ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉండగా, కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వాషింగ్టన్‌కు వెళ్లిపోయారు. ఉపాధ్యక్షురాలిగా అధికార నివాసంలో ప్రస్తుతం మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా అధ్యక్షుడి అతిథి గృహం బ్లెయిర్ హౌస్‌లో నివసిస్తున్నారు.
Also Read:
సంచలన నిర్ణయం తీసుకున్న బ్రిటన్ యువరాజు హ్యారీ.. రాచరికపు మర్యాదలను వదలుకుంటున్నట్లు వెల్లడి