
US Navy sing popular Hindi song : అగ్రరాజ్యం అమెరికా నేవీ బృందం ఇండియా కోసం హిందీ పాటను ఆలపించిన అరుదైన సంఘటన ఇది. యూఎస్ చీఫ్ ఆఫ్ నావల్ ఆపరేషన్స్ – భారత రాయబారి డిన్నర్ మీట్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. యూఎస్ చీఫ్ ఆఫ్ నావల్ ఆపరేషన్స్(సీఎన్ఓ) మైఖేల్ గిల్డే, అమెరికాలోని భారత రాయబారి తరణ్ జిత్ సింగ్ సంధు స్నేహపూర్వక విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా నేవీ బ్యాండ్ భారత అతిథులను ఆనందపరిచేందుకు హిందీ పాటను పాడింది.
2004లో వచ్చిన బాలీవుడ్ మూవీ ‘స్వదేశ్’ సినిమాలో హీరో షారూఖ్ తన స్వదేశీ తీపిగుర్తుల్ని స్మరించుకుంటూ భారంతో పాడుకునే ‘యే జో దేశ్ హై తేరా’ పాటను నేవీ బ్యాండ్ ఆలపించింది. ఈ వీడియో భారత రాయబారి సంధు ట్విటర్లో షేర్ చేశారు. ఈ ట్వీట్ ను షారూఖ్, ఆపాటను స్వరపరిచి స్వయంగా ఆలపించిన ఎఆర్ రెహమాన్ రీట్వీట్ చేశారు. అంతేకాదు, ఈ పాట ఆలపించినందుకు అమెరికా నేవీకి, అమెరికాలోని భారత రాయబారి తరణ్ జిత్ సింగ్ సంధుకు థ్యాంక్స్ చెప్పారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయింది.
Us Navy Hindi Song Sing