US Heavy Rain: అమెరికాలో హరికేన్‌ విధ్వంసం.. కుండపోత వర్షాలతో న్యూయార్క్‌, న్యూజెర్సీ కకావికలం.. 41 మృతి

|

Sep 03, 2021 | 8:53 AM

భారీ వర్షాలు, వరదల బీభత్సం ధాటికి అగ్రరాజ్యం వణికిపోతుంది. అమెరికాలో హరికేన్‌ విధ్వంసం సృష్టిస్తున్నాయి. కుండపోత వానలతో యూఎస్‌ను అతలాకుతలం చేస్తోంది ఐడా తుఫాన్‌.

US Heavy Rain: అమెరికాలో హరికేన్‌ విధ్వంసం.. కుండపోత వర్షాలతో న్యూయార్క్‌, న్యూజెర్సీ కకావికలం.. 41 మృతి
Us Heavy Rains
Follow us on

America Flash Floods: భారీ వర్షాలు, వరదల బీభత్సం ధాటికి అగ్రరాజ్యం వణికిపోతుంది. అమెరికాలో హరికేన్‌ విధ్వంసం సృష్టిస్తున్నాయి. కుండపోత వానలతో యూఎస్‌ను అతలాకుతలం చేస్తోంది ఐడా తుఫాన్‌. లూసియానాలో బీభత్సం సృష్టించిన ఐడా హరికేన్‌.. ఇప్పుడు న్యూయార్క్‌, న్యూజెర్సీలను కకావికలం చేస్తోంది.

న్యూయార్క్‌లో రికార్డ్‌ స్థాయిలో కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు నీటమునిగిపోయాయి. వాహనాలు, ఇళ్లు ముంపుకు గురయ్యాయి. వర్షాలు, వరదలకు 41 మంది మృతి చెందగా..పలువురు గల్లంతయ్యారు. తుఫాను ప్రభావంతో న్యూయార్క్‌, న్యూజెర్సీలో ఎమర్జెన్సీ ప్రకటించారు గవర్నర్లు. గత 4 రోజులుగా లూసియానాను గడగడలాడించింది ఇడా హరికేన్‌. ఇప్పటికీ లూసియానా అంధకారంలోనే ఉంది. విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించలేదు. 20ఏళ్లలో ఎన్నడూ లేని వర్షాలు, వరదలకు చిగురుటాకులా వణికిపోతోంది లూసియానా.

న్యూయార్క్‌, న్యూజెర్సీ‌లో గంట వ్యవవధిలో 80 మిల్లీమీటర్ల వర్షం.. ఎక్కడ చూసిన నీరే.. రోడ్లన్నీ నదుల్లా మారిపోయాయి. బేస్‌మెంట్లు, సబ్‌వేలు నీటితో నిండిపోయాయి.. ముఖ్యంగా న్యూయార్క్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కుంభవృష్టి కురవడంతో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయింది. దీంతో న్యూయార్క్‌లో అత్యవసర పరిస్థితి విధించినట్లు గవర్నర్‌ కేటీ హోచుల్‌ ప్రకటించారు. సబ్‌వేలను మూసివేశామని, రైళ్లను కూడా ఆపివేశామని తెలిపారు. లగార్డియా, జేఎఫ్‌కే విమానాశ్రయాలు ముంపునకు గురవడంతో వందల కొద్ది విమానాలను రద్దు చేశామన్నారు. పట్టణంలో ఇప్పటివరకు 12 మంది చనిపోయారని, మరో 11 మంది బేస్‌మెంట్లలో చిక్కుకుపోయారని వెల్లడించారు. అందులో 2 నుంచి 86 ఏండ్ల వయస్సులో ఉన్నవారే ఉన్నట్లు వెల్లడించారు. ఇక న్యూజెర్సీలో ఐడా తుఫాను ధాటికి 23 మంది చనిపోయారని గవర్నర్‌ ఫిల్‌ మర్ఫీ తెలిపారు. సుమారు 60 వేల ఇండ్లకు కరెంటు సరఫరా నిలిచిపోయిందన్నారు.

Read Also…  Covid In AP Schools: ఏపీ స్కూల్స్‌లో కరోనా వైరస్ కలకలం.. తాజాగా కృష్ణ జిల్లాలో ఐదుగురు విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్

Land Rover: ల్యాండ్‌ రోవర్‌ డిఫెండర్‌ వీ8 బాండ్‌ ఎడిషన్‌ వచ్చేస్తోంది.. లంబోర్గిని ఉరుస్‌కు ధీటుగా..!

Chanakya Niti: ఈ 3 విషయాలను ఖచ్చితంగా గుర్తించుకోండి.. లేదంటే జీవితం నాశనమైనట్లే!