అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలు తనను ఎన్నుకోకపోతే ఈ దేశాన్ని వదిలిపోతానని అన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. శుక్రవారం జార్జియాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన ఆయన, రాజకీయ చరిత్రలో ఓ అధ్వాన్నపు అభ్యర్థి (జో బైడెన్) చేతిలో ఓడిపోవడంకన్నా అదే బెటరేమో అని వ్యాఖ్యానించారు. ఇది జోక్ కాదని, పొలిటికల్ హిస్టరీలో పస, సామర్థ్యం లేని అభ్యర్థిపై తను పోటీ చేయవలసి వస్తోందని, ఇది తనపై ఎంతో ఒత్తిడి తెస్తోందని ఆయన చెప్పారు. ‘నేను ఓటమి పాలైతే మీరే ఊహించండి..నా జీవితమంతా ఏం చేయాలి ? అయామ్ నాట్ గోయింగ్ టు ఫీల్ సో గుడ్.. ఐ మే లీవ్ దిస్ కంట్రీ’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఈయనకన్నా డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ కే పలు రాష్ట్రాల్లోని ఓటర్లు జైకొడుతున్నారు. ఫ్లోరిడాలో జరిగిన ర్యాలీలో బైడెన్ స్పీచ్ వినేందుకే చాలామంది హాజరయ్యారు. హాలంతా నిండిపోగా, ట్రంప్ గారి ర్యాలీకి మాత్రం జనం పలచగా కనిపించారు. నవంబరు 3 న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.