బే ఏరియాలో ఘనంగా వైఎస్సార్ జయంతి ఉత్సవాలు

| Edited By: Anil kumar poka

Jul 10, 2019 | 10:40 AM

అమెరికాలోని బే ఏరియాలో దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి జయంతిని ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వసంతకుమార్, సినీ నటుడు పృథ్వీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు వైఎస్‌ను స్మరించుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి చెందుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ ప్రజలకిచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తారని.. అవినీతి, అక్రమాలకు అతీతంగా పారదర్శక పాలన అందిస్తున్నారని.. ఆయన హయాంలో రాష్ట్రం […]

బే ఏరియాలో ఘనంగా వైఎస్సార్ జయంతి ఉత్సవాలు
Follow us on

అమెరికాలోని బే ఏరియాలో దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి జయంతిని ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వసంతకుమార్, సినీ నటుడు పృథ్వీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు వైఎస్‌ను స్మరించుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి చెందుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ ప్రజలకిచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తారని.. అవినీతి, అక్రమాలకు అతీతంగా పారదర్శక పాలన అందిస్తున్నారని.. ఆయన హయాంలో రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని వసంత కుమార్ ధీమా వ్యక్తం చేశారు.