student suicide in canada: కెనడాలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య.. భవనంపై నుంచి దూకి బలవన్మరణం..!

|

Apr 01, 2021 | 6:11 PM

ఉన్నత చదవులు అభ్యసించి ప్రయోజకుడవుతాడనుకున్న కొడుకు అంతలోనే అనంతలోకాలకు పయనమయ్యాడు. కెనడాలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

student suicide in canada: కెనడాలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య.. భవనంపై నుంచి దూకి బలవన్మరణం..!
Telangana Student Suicide In Canada
Follow us on

student suicide in canada: ఉన్నత చదవులు అభ్యసించి ప్రయోజకుడవుతాడనుకున్న కొడుకు అంతలోనే అనంతలోకాలకు పయనమయ్యాడు. కెనడాలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల ప్రకారం నల్గొండ జిల్లా దిండి మండలం ఆకుతోటపల్లికి చెందిన ప్రవీణ్‌రావు కెనడాలో ఓ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారని స్థానిక పోలీసులు తెలిపారు. ఆకుతోటపల్లికి చెందిన ప్రవీణ్ రావు 2015లో ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లారు. గురువారం ఉదయం భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

అయితే, ప్రవీణ్ రావు ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఉన్నత చదువుల కోసం విదేశం వెళ్లి అక్కడ బలవన్మరణానికి పాల్పడటంతో ప్రవీణ్ రావు కుటుంబంతోపాటు అతని స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

తమ కుమారుడు అర్ధాంతరంగా జీవితాన్ని ముగించడం పట్ల ప్రవీణ్ రావు తల్లిదండ్రులు నారాయణరావు, హైమావతి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సాధారణ రైతు కుటుంబానికి చెందిన ప్రవీణ్ రావు.. ఉన్నతాశయంతో విదేశాలకు వెళ్లాడని, కానీ, తన లక్ష్యం నెరవేర్చుకోకముందే ప్రాణాలు తీసుకోవడంపై కుటుంబసభ్యులు, గ్రామస్తులు శోక సంద్రంలో మునిగిపోయారు.

Read Also…మరోసారి కాల్పులమోతతో దద్దరిల్లిన కాలిఫోర్నియా.. చిన్నారితోసహా నలుగురు వ్యక్తులు దుర్మరణం