కోవిడ్ నేపథ్యం, ఇండియాపై అమెరికా ప్రయాణ ఆంక్షలు, ఎవరెవరిని మినహాయించారంటే ?

| Edited By: Anil kumar poka

May 01, 2021 | 10:45 AM

ఇండియాలో పెరిగిపోయిన కోవిద్ కేసుల నేపథ్యంలో అమెరికా  ట్రావెల్ ఆంక్షలను అమలు చేయనుంది.  ఈ నెల 4 నుంచి అమలులోకి రానున్న వీటి విషయమై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్...

కోవిడ్ నేపథ్యం,  ఇండియాపై అమెరికా ప్రయాణ ఆంక్షలు, ఎవరెవరిని మినహాయించారంటే ?
Some Categories Exempted From Us Travel Restrictions
Follow us on

ఇండియాలో పెరిగిపోయిన కోవిద్ కేసుల నేపథ్యంలో అమెరికా  ట్రావెల్ ఆంక్షలను అమలు చేయనుంది.  ఈ నెల 4 నుంచి అమలులోకి రానున్న వీటి విషయమై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్..ప్రొక్లమేషన్ జారీ చేసిన కొన్ని గంటలకే విదేశాంగ మంత్రి   టోనీ బ్లింకెన్ .. ఈ ఆంక్షల నుంచి కొన్ని వర్గాలను మినహాయిస్తున్నట్టు తెలిపారు. బ్రెజిల్, చైనా, ఇరాన్, సౌతాఫ్రికా వంటి దేశాలకు చెందిన వర్గాలకు మినహాయింపులు ఇచ్చినట్టే ఇవి కూడా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో తమ స్టడీస్ ని ప్రారంభించాలని కోరే విద్యార్థులకు, అకడమిక్స్ కు, జర్నలిస్టులకు, ఇంకా కోవిడ్ రోగులకు క్రిటికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అందించే వ్యక్తులకు  ఈ మినహాయింపులు ఉంటాయని ఆయన వివరించారు. ఇండియాతో బాటు చైనా, ఇరాన్ వంటి దేశాల్లో ఉన్న క్వాలిఫైడ్ అప్లికెంట్లకు కూడా ఈ సౌకర్యం వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు.ఈ కోవిడ్ పాండమిక్ కారణంగా వీసా దరఖాస్తులను  కూడా పరిమితం  చేయనున్నారు. విద్యార్థులు  తమ సమీప ఎంబసీ లేదా కాన్సులేట్ కార్యాలయాల వెబ్ సైట్లను చెక్ చేస్తుండాలని, తద్వారా వారికి ఎప్పటికప్పుడు సమాచారం తెలుస్తుందని బ్లింకెన్ వివరించారు. రానున్న రోజుల్లో మరిన్ని వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. స్టూడెంట్స్ తమ అకడమిక్ స్టడీస్ ప్రారంభానికి 30 రోజుల ముందే అమెరికాలో ప్రవేశించాల్సి ఉంటుంది.

కాగా ఇండియాలో ఉన్న అమెరికన్లు సాధ్యమైనంత  త్వరగా స్వదేశానికి  రావాలని బైడెన్ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. భారత దేశంలో  విస్తరిస్తున్న వేరియంట్లపై వివిధ  దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  ఈ కొత్త వేరియంట్ల కారణంగానే ఆ దేశంలో కేసులు పెరిగిపోతున్నాయని ఆయా దేశాలు భావిస్తున్నాయి. ఇప్పటికే వీటిపై రీసర్చర్లు పరిశోధనలు మొదలు పెట్టారు.