Lady Gaga’s Bull Dogs: అమెరికాలో పాప్ సింగర్ లేడీ గాగా ఎంతగానో అభిమానించే రెండు శునకాలు సేఫ్ గా ఆమె వద్దకు చేరాయి. రెండు రోజుల క్రితం వీటిని దొంగలు అపహరించుకుపోయారు. కోజీ, గుస్తావ్ అనే పేర్లు గల ఈ కుక్కలను ఈ నెల 25 న లేడీ గాగా కార్యాలయ ఉద్యోగి ఒకరు లాస్ ఏంజిల్స్ లో తీసుకువెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి ఆయనపై కాల్పులు జరిపారు. గాయపడిన ఆ వ్యక్తిని అక్కడే వదిలేసి ఆ శునకాలను దొంగిలించుకుపోయారు. తాను ఎంతో ఇష్టంగా, అభిమానంగా పెంచుకునే వీటిని తిరిగి అప్పగించినవారికి 5 లక్షల డాలర్లను నజరానాగా ఇస్తానని లేడీ గాగా ప్రకటించింది. ఇవి లేక తన హృదయం గాయపడిందని, ఫ్రెంచ్ బుల్ డాగ్స్ అయిన వీటికోసం తన కుటుంబం పరితపిస్తోందని, దయ చేసి వీటిని తమకు అప్పగించినవారికి 5 లక్షల డాలర్లను రివార్డుగా ఇస్తానని కూడా ఆమె పేర్కొంది. కాగా ఈ శునకాలను తీసుకువెళ్తూ దుండగుల కాల్పుల్లో గాయపడిన ర్యాన్ ఫిషర్ అనే ఉద్యోగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
తన జాగిలాలను రక్షించేందుకు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయని ఈ ఉద్యోగిని లేడీ గాగా ప్రశంసలతో ముంచెత్తింది. మీరు ఎప్పటికీ మా కుటుంబ హీరో.. ఐ లవ్ యూ అని అభిమానంగా ఆమె ట్వీట్ చేసింది. అటు దుండగుల కాల్పుల్లో ఫిషర్ గాయపడగానే ‘మిస్ ఆసియా’ అనే మూడో శునకం భయంతో పరుగెత్తి పారిపోయిందట. కానీ మళ్ళీ దాన్ని పోలీసులు పట్టుకుని సేఫ్ గా తీసుకు వచ్చారు. ఫ్రెంచ్ బ్రీడ్ బుల్ డాగ్స్ చాలా ఖరీదైనవి. కొన్ని వేలు, ఒకోసారి లక్షల డాలర్లు పెట్టి వీటి అభిమానులు వీటిని కొనుగోలు చేస్తుంటారు. ఇక లేడీ గాగాకు చెందిన ఈ శునకాలపైనా దుండగులు కన్ను వేశారా అణా విషయం ఇంకా తేలాల్సి ఉంది. ఇంత జరిగినా తన కుక్కలను కేవలం రెండురోజులకే క్షేమంగా తన వద్దకు చేర్చిన పోలీసులపై లేడీ గాగా ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు. ర్యాన్ ఫిషర్ పై స్పందించింది గానీ..లాస్ ఏంజిల్స్ పోలీసుల చురుకైన దర్యాప్తు మీద ఈ సింగర్ మౌనం వహించింది.
Both of Lady Gaga’s dogs have been turned in to a local police station, and they have been safely reunited with Lady Gaga representatives. https://t.co/c5Z5QMa944
— LAPD HQ (@LAPDHQ) February 27, 2021
Read More:
Stock market: భారీగా పతనమైన రూపాయి విలువ.. 18 నెలల్లో ఇదే అత్యధికం.. కుదేలైన షేర్ మార్కెట్లు