Bomb Cyclone: అమెరికాలో బాంబ్‌ సైక్లోన్‌ టెర్రర్‌.. 22కి చేరిన మృతుల సంఖ్య.. క్రిస్మస్‌ వేడులకలపై మంచుతుఫాన్‌ ప్రభావం

|

Dec 25, 2022 | 2:02 PM

విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో దాదాపు 17 లక్షల ఇండ్లు, వ్యాపార సంస్థలు అంధకారంలోకి జారుకున్నాయి. 13 రాష్ర్టాలపై బాంబ్‌ సైక్లోన్‌ ప్రభావం ఉంది. ఈ పరిస్థితుల్లో పవర్‌ ప్లాంట్‌లను నడపడం కష్టసాధ్యంగా ఉందని మేజర్‌ గ్రిడ్‌ అధికారులు..

Bomb Cyclone: అమెరికాలో బాంబ్‌ సైక్లోన్‌ టెర్రర్‌.. 22కి చేరిన మృతుల సంఖ్య.. క్రిస్మస్‌ వేడులకలపై మంచుతుఫాన్‌ ప్రభావం
Bomb Cyclone
Follow us on

అమెరికాలో బాంబ్‌ సైక్లోన్‌ బీభత్సం కొనసాగుతోంది. మంచుతుఫాన్‌ కారణంగా చనిపోయిన వాళ్ల సంఖ్య 21కి చేరుకుంది. ఉష్ణోగ్రతలు మైనస్‌ 45 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో ఇళ్ల నుంచి బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో దాదాపు 17 లక్షల ఇండ్లు, వ్యాపార సంస్థలు అంధకారంలోకి జారుకున్నాయి. 13 రాష్ర్టాలపై బాంబ్‌ సైక్లోన్‌ ప్రభావం ఉంది. ఈ పరిస్థితుల్లో పవర్‌ ప్లాంట్‌లను నడపడం కష్టసాధ్యంగా ఉందని మేజర్‌ గ్రిడ్‌ అధికారులు తెలిపారు.

దేశంలోని 60 శాతం మందిపై ఈ మంచు తుఫాను ప్రభావం పడింది. దేశ వ్యాప్తంగా 5,700 విమానాలను రద్దు చేశారు. పలు చోట్ల రోడ్లపై మంచు పేరుకుపోవడంతో ఆయా రహదారులను మూసివేశారు. క్రిస్మస్‌ సందర్భంగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామంది తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. క్రిస్మస్‌ ముందు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో ఫ్లోరిడా, మేరిలాండ్‌, న్యూజెర్సీ, నార్త్‌ కరోలినా, పెన్సిల్వేనియా, కెంటకీ తదితర ప్రాంత ప్రజలు వేడుకలకు దూరంగా ఉన్నారు.

శీతాకాలపు శక్తివంతమైన తుఫాను క్రిస్మస్‌కు ముందు పీడకల సృష్టించడంతో శనివారం దేశవ్యాప్తంగా వేలాది మంది విమాన ప్రయాణికులు చిక్కుకుపోయారని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. దశాబ్దాలలో అత్యంత భయంకరమైన తుఫానుగా పేర్కొనబడిన తుఫాను మిలియన్ల మంది అమెరికన్ల ప్రయాణ ప్రణాళికలకు అంతరాయం కలిగించింది.

ఇవి కూడా చదవండి

విపరీతమైన శీతాకాల వాతావరణం కారణంగా నిరాశ్రయులైన వారికి తాత్కాలిక ఆశ్రయాన్ని అందిస్తున్నారు. ఇందులో భాగాంగా స్థానిక లైబ్రరీలు, పోలీసు స్టేషన్లను ఉపయోగిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం