Rare Cancer: ఆ స్కూల్ 100 మంది ఓల్డ్ స్టూడెంట్స్, సిబ్బందికి అరుదైన క్యాన్సర్.. మిస్టరీని ఛేదించేందుకు రంగంలోకి అధికారులు

Rare Cancer: ఎవరైనా ఏదైనా పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు, సిబ్బంది తమ సంతోషాన్ని ఒకరితోనొకరు పంచుకోవడానికి కలుస్తారు.. అయితే ఆ స్కూల్ లో చదివిన వారు , పని చేసిన సిబ్బంది మాత్రం..

Rare Cancer: ఆ స్కూల్ 100 మంది ఓల్డ్ స్టూడెంట్స్, సిబ్బందికి అరుదైన క్యాన్సర్.. మిస్టరీని ఛేదించేందుకు రంగంలోకి అధికారులు
New Jersey School

Updated on: Apr 16, 2022 | 6:29 PM

Rare Cancer: ఎవరైనా ఏదైనా పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు, సిబ్బంది తమ సంతోషాన్ని ఒకరితోనొకరు పంచుకోవడానికి కలుస్తారు.. అయితే ఆ స్కూల్ లో చదివిన వారు , పని చేసిన సిబ్బంది మాత్రం.. అందుకు విరుద్ధం.. ఆ  పాఠశాలలో చదువుకున్న స్టూడెంట్స్ కాలక్రమంలో క్యాన్సర్ (Cancer) బారిన పడుతున్నట్లు తెలిసింది. అలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 100మంది ఆ స్కూల్ కు చెందిన పూర్వపు విద్యార్థులు, సిబ్బంది అరుదైన క్యాన్సర్ బారినపడినట్లు వెలుగులోకి వచ్చి సంచలనం రేపుతోంది. ఆ స్కూల్ ఓల్డ్ స్టూడెంట్ కు క్యాన్సర్ బారిన పడ్డాడు.. అయితే  తనకు క్యాన్సర్‌ ఏవిధంగా సోకిందో తెలుసుకుందామని చేసిన ప్రయత్నంలో సంచలనం షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మిస్టరీ అమెరికాలోని(America) న్యూజెర్సీలో(NewJersy) ఓ స్కూల్ లో చోటు చేసుకుంది. దీనిపై అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. వివరాల్లోకి వెళ్తే..

న్యూజెర్సీ వూడ్‌బ్రిడ్జ్‌లోని కలోనియా హైస్కూల్‌లో చదువుకున్నఓ స్టూడెంట్ అల్ లుపియానోకు అరుదైన క్యాన్సర్ సర్వైవర్ బారినపడ్డాడు. దాదాపు అతను దాదాపు 20 సంవత్సరాల క్రితం ‘అరుదైన’ బ్రెయిన్ ట్యూమర్‌ బారిన పడ్డాడు. అయితే అల్ లుపియానో తో పాటు అతని భార్య, సోదరి కూడా అదే క్యాన్సర్ బారిన పడ్డారు. సోదరి, భార్య మరణించిన అనంతరం అసలు ఒకే విధమైన క్యాన్సర్ తన ఫ్యామిలీకి ఎలా సోకింది అనే విషయంపై ఆసక్తి కల్గింది. ఎలాగైనా సరే ఈ మిస్టరీని ఛేదించాలని నిర్ణయించుకున్నాడు. గత నెలలో తన భార్య మరణించిన అనంతరం లుపియానో కారణాన్ని అన్వేషించడం మొదలు పెట్టాడు.

అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ న్యూరోలాజికల్ సర్జన్స్ ప్రకారం.. బ్రెయిన్‌ క్యాన్సర్‌ (గ్లియోబ్లాస్టోమా) అరుదైన క్యాన్సర్. ఇది లక్ష మందిలో  3.21 శాతం మంది మాత్రమే సోకె అరుదైన వ్యాధి. అయితే 1975 మరియు 2000 మధ్య కలోనియా హైస్కూల్‌లో చదువుకున్న లేదా అక్కడ పనిచేసిన ఉపాధ్యాయుల్లో 102 మంది వ్యక్తులు ఒకే రకమైన మెదడు క్యాన్సర్‌తో బాధపడుతున్నారని లుపియానో ​​గుర్తించాడు. ఇదే విషయాన్నీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళాడు.

దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన వుడ్‌బ్రిడ్జ్ అధికారులు ఇప్పుడు వ్యాధికి అంతర్లీన కారణాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదే విషయంపై స్పందించిన వూడ్‌బ్రిడ్జ్‌ మేయర్‌ జాన్‌ మెక్‌కార్మాక్‌.. ఇది కచ్చితంగా అసాధారణమైన విషయమే. ఈ సమస్యకు గల కారణాలను తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు’ అని అన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఆందోళన నెలకొందని మేయర్ చెప్పారు. మరోవైపు ఒకే పాఠశాలకు చెందిన ఇంతమంది బాధితులుగా మారడానికి సమాధానాలు లభించే వరకూ విశ్రాంతి తీసుకోనని 50ఏళ్ల లుపియానో స్పష్టం చేస్తున్నారు.

ఇదే విషయంపై  CBS న్యూస్ ఒక కథనాన్ని ప్రసారం చేసిన  అనంతరం ఈ సమస్య యునైటెడ్ స్టేట్స్‌లో జాతీయ శీర్షికగా మారింది . ఇది ఇప్పుడు టిక్‌టాక్‌లో చర్చించబడే హాట్ టాపిక్‌లలో ఒకటి. అధికారులు పాఠశాల యొక్క 28 ఎకరాల క్యాంపస్‌లో రేడియోలాజికల్ అసెస్‌మెంట్‌లను నిర్వహిస్తారు. ఇందులో రాడాన్ కోసం ఇండోర్ ఎయిర్ శాంపిల్స్ పరీక్ష కూడా ఉంటుంది. దీంతో పాఠశాల గదుల్లోని రేడియోధార్మికతపై అనుమానాలు వ్యక్తం చేశారు.  స్కూల్ గదుల్లోని  ర్యాండన్ మూలకంతోపాటు ఇతర నమూనాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

Also Read: Viral Video: కెమెరాకు చిక్కిన మహిళ మృతదేహాన్ని వీడిన ఆత్మ వీడియో.. సొంత రిస్క్ తీసుకుని చూడమంటున్న నెటిజన్లు