9/11 Attacks: ప్రపంచం ఉలిక్కిపడేలా చేసిన ఉగ్రదాడికి 20 ఏళ్లు.. తెర వెనుక ఇంత జ‌రిగిందా..!

|

Sep 11, 2021 | 7:05 AM

9/11 Attacks: అది 2001 సెప్టెంబర్ 11.. ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై..

9/11 Attacks: ప్రపంచం ఉలిక్కిపడేలా చేసిన ఉగ్రదాడికి 20 ఏళ్లు.. తెర వెనుక ఇంత జ‌రిగిందా..!
Follow us on

9/11 Attacks: అది 2001 సెప్టెంబర్ 11.. ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై అల్‌ఖైదా పక్కా వ్యుహంతో జరిపిన ఉగ్రదాడికి నేటితో 20 ఏళ్లు అవుతోంది. ఈ దాడి జనాలను భయభ్రాంతులకు గురి చేసింది. ఇది చరిత్రలో ఉగ్రవాదులు జరిపిన అతిపెద్ద దాడిగా నిలిచింది. ఈ ఉగ్రదాడిలో దాదాపు 3వేల మంది ప్రాణాలు కోల్పోయాయరు. ఈ నేపథ్యంలో తీవ్రంగా స్పందించిన అమెరికా.. ఈ దాడుల వెనక ఉగ్రమూకలను మట్టుబెట్టడమే లక్ష్యంగా అఫ్గానిస్తాన్‌లో కాలుమోపింది. నేటితో ఈ 9/11 మరణహోమానికి 20 ఏళ్లు పూర్తి కానున్న వేళ.. ఈ కాలంలో జరిగిన కీలక పరిణామాలను మర్చిపోలేకపోతున్నారు.

హైజాక‌ర్లు రెండు విమానాల‌ను న్యూయార్క్‌లోని వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్‌కు చెందిన జంట సౌధాల‌ను ఢీకొట్టించారు. సౌదీ అరేబియా, ఇత‌ర అర‌బ్ దేశాల‌కు చెందిన వారే ఈ ఘ‌ట‌న‌కు పాల్పడిన‌ట్లు త‌ర్వాత కాలంలో గుర్తించారు. ఈ బృందానికి అప్పటి ఆల్‌ఖైదా నాయ‌కుడు ఓసామా బిన్ లాడెన్ నేతృత్వం వ‌హించారు.

వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్‌పై జ‌రిగిన దాడి ఘ‌ట‌న‌లో ప్రయాణికులంద‌రూ, భ‌వ‌నాల్లో ప‌నిచేస్తున్న అనేక మంది దుర్మర‌ణం పాల‌య్యారు. రెండు సౌధాలు(భ‌వ‌నాలు) అంద‌రూ చూస్తుండ‌గానే గంట‌ల వ్యవ‌ధిలో కుప్పకూలిపోయాయి. స‌మీపంలోని భ‌వనాలు ధ్వంసం కావ‌డం, మ‌రికొన్ని పాక్షికంగా దెబ్బతిన‌డం జ‌రిగింది.

మూడో విమానాన్ని హైజాకర్లు వాషింగ్టన్ డీసీకి వెలుపల ఉన్న ఆర్లింగ్టన్, వర్జీనియాలోని పెంటగాన్‌పైకి వదిలారు. నాలుగో విమానాన్ని అందులోని కొందరు ప్రయాణీకులు, విమాన సిబ్బంది తిరిగి దానిని నియంత్రించే ప్రయత్నం చేసినప్పుడు, గ్రామీణ పెన్సిల్వేనియాలోని షాంక్స్‌విల్లేకి సమీపంలో ఉన్న ఒక మైదానంలో అది కుప్పకూలింది. దీనిని హైజాకర్లు వాషింగ్టన్ డీసీ వైపుకు మళ్లించారు. విమానాల్లో ప్రయాణించిన ఏ ఎక్కరూ ప్రాణాలతో బయటపడలేదని వార్తా సంస్థలు నివేదించాయి.

తెర వెనుక ఇంత జ‌రిగిందా..

సెప్టెంబర్ 11 దాడుల కుట్ర వెనుక ప్రధాన సూత్రధారి ఖలీద్ షేక్ మహ్మద్‌. 1996లో అతను తన వ్యూహాన్ని ఒసామా బిన్ లాడెన్‌కు వివరించాడు. ఆ సమయంలో, బిన్ లాడెన్, అల్‌ఖైదాలు మార్పు దశలో ఉన్నాయి. సూడాన్ నుంచి తిరిగి ఆఫ్గనిస్తాన్‌కు మకాం మార్చుకున్నారు. 1998 ఆఫ్రికన్ దౌత్యకార్యాలయంపై బాంబు దాడులు, బిన్ లాడెన్ యొక్క 1998 ఫత్వా ఒక మలుపును గుర్తించాయి. అంటే బిన్ లాడెన్ అమెరికా సంయుక్తరాష్ట్రాలపై దాడులకు కుట్ర పన్నే యోచనలో ఉన్నట్లు అర్థమైంది. డిసెంబరు, 1998లో విమానాల దారిమళ్లింపుకు వ్యక్తులకు శిక్షణ ఇవ్వడం సహా యూఎస్‌ఏలో దాడులకు అల్‌ఖైదా సన్నద్ధమవుతోందని అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు డైరెక్టర్ ఆఫ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ తీవ్రవాద నిరోధన కేంద్రం తెలిపింది.

అమెరికా ర‌క్షణ శాఖ ఎంతో శ‌క్తివంత‌మైన‌ది, సీఐఏ ఎంతో ముందుచూపు క‌లిగి ఉన్నదైన‌ప్పటికీ ఆల్‌ఖైదా టీమ్ ప‌క్కా ప్రణాళిక‌తో అనుకున్న విధంగా వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్‌పైన దాడులు చేయగలిగింది.
అయితే ఈ ఉగ్రదాడిలో మరణించిన ఇద్దరు వ్యక్తుల అవశేషాలు తాజాగా గుర్తించబడ్డాయి. ఈ గుర్తించబడినవి అక్టోబర్ 2019 తర్వాత మొదటివి.

సెప్టెంబర్ 11, 2001 నాటి ఘటన మనం ఎన్నటికీ మరచిపోలేము. ఆ దాడిలో తమవారిని కోల్పోయిన వారందరూ తమ కుటుంబ సభ్యుల మృతదేహాలను చూసుకునేలా చేయడానికి మా వద్ద ఉన్న అన్ని సాధనాలను ఉపయోగిస్తామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము అని న్యూయార్క్ చీఫ్ మెడికల్ ఎగ్జామినార్ డాక్టర్ బార్బరా ఎ. సాంప్సన్ తెలిపారు.

మెడికల్ ఎగ్జామినర్ ఆఫీసులోని టెక్నీషియన్లు.. వరల్డ్ ట్రేడ్ సెంటర్ శిథిలాల నుండి వెలికితీసిన వేలాది శరీర అవశేషాలను తెలిసిన బాధితులతో సరిపోల్చడానికి సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ డీఎన్‌ఏ ఐడెంటిఫికేషన్ టీమ్ మేనేజర్ మార్క్ డిజైర్ బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డీఎన్‌ఏ, సీక్వెన్సింగ్‌లో ఇటీవలి పురోగతులు మరిన్ని గుర్తింపులకు కారణమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని అవశేషాలు ఎప్పటికీ గుర్తించబడకపోవచ్చు అని ఆయన చెప్పారు.

ఇవీ కూడా చదవండి:

Modi US Tour: ప్రధాని మోడీ అమెరికా పర్యటన ఖరారు.. బైడెన్‌తో కీలక భేటీ.. ఐక్యరాజ్య సమితిలో మోడీ ప్రసంగంపై ఉత్కంఠ

Afghan-Taliban: పంజ్‌షీర్‌లో కొనసాగుతున్న తాలిబన్ల నరమేధం.. కేర్‌ టేకర్‌ ప్రెసిడెంట్‌ అమ్రుల్లా సలేష్‌ సోదరుడిని కాల్చివేత!