ఇది వృధా చేసే సమయం కాదు, కృషి చేద్దాం, 1.9 ట్రిలియన్ డాలర్ల పాండమిక్ ప్లాన్ ని లాంచ్ చేసిన జోబైడెన్

| Edited By: Pardhasaradhi Peri

Jan 16, 2021 | 1:29 PM

అమెరికా అధ్యక్షుడు కానున్న జో బైడెన్.. 1.9 ట్రిలియన్ డాలర్ల కోవిడ్ రెస్క్యూ ప్లాన్ ని లాంచ్ చేశారు. దేశం ఓ వైపు కరోనా వైరస్ సమస్యను..

ఇది వృధా చేసే సమయం కాదు, కృషి చేద్దాం, 1.9 ట్రిలియన్ డాలర్ల పాండమిక్ ప్లాన్ ని లాంచ్ చేసిన జోబైడెన్
Follow us on

అమెరికా అధ్యక్షుడు కానున్న జో బైడెన్.. 1.9 ట్రిలియన్ డాలర్ల కోవిడ్ రెస్క్యూ ప్లాన్ ని లాంచ్ చేశారు. దేశం ఓ వైపు కరోనా వైరస్ సమస్యను, మరోవైపు ఆర్ధిక వ్యవస్థ క్షీణతను ఎదుర్కొంటున్న తరుణంలో వాటిని పరిష్కరించేందుకు ఈ నూతన కార్యాచరణ ప్రణాళిక ఎంతయినా తోడ్పడుతుందని ఆయన చెప్పారు. అయితే ఈ ప్రతిపాదనను ప్రతినిధుల సభ, సెనేట్ ఆమోదించాల్సి ఉంటుంది. అర్హతగల వ్యక్తులకు 1400 డాలర్ల సాయం, చిరు వ్యాపారులు, నిరుద్యోగులకు 2 వేల డాలర్ల సాయం అందజేయాలన్న ఇదివరకటి ప్రతిపాదనలు కూడా ఈ ప్లాన్ లో ఉన్నాయి. అయితే ఈ భారీ ప్రతిపాదన కారణంగా భవిష్యత్ తరాలు అప్పుల ఊబిలో కూరుకుపోగలవన్న రిపబ్లికన్ల అందోళనను జో బైడెన్ తోసిపుచ్చారు. మొదట మన ముందున్న తక్షణ సమస్యలను పరిష్కరించాల్సి ఉందన్నారు. ఇది వృధా చేయాల్సిన సమయం కాదని, మనం చురుకుగా ముందడుగు వేసి కృషి చేయాల్సిన సమయమని ఆయన అన్నారు.  చారిత్రాత్మక  నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకంజ వేయరాదని, మనదేశ తక్షణ సవాళ్ళను ఇప్పుడు పరిష్కరించకపోతే ఇవి అలాగే ఉండిపోతాయని ఆయన పేర్కొన్నారు.

సెనేట్ లో మూడు దశాబ్దాలకు పైగా ఉన్న జో బైడెన్.. సభ్యులందరి అభిప్రాయాలను తీసుకుని ఏకాభిప్రాయ సాధనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ నెల 20 న  దేశ నూతన అధ్యక్షునిగా బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Also Read:

సికింద్రాబాద్ జ్యూవెల్లరీ కేసును ఛేదించిన పోలీసులు.. నిందితుడు ఎవరో తెలిసేసరికి అవాక్కయిన..

Signal App: వాట్సప్ ప్రైవసీ పాలసీ ఎఫెక్ట్.. నిలిచిపోయిన ‘సిగ్నల్’ యాప్.. అసలు కారణం ఇదే..

వ్యాక్సిన్ తీసుకోగానే సరిపోదు, ప్రోటోకాల్స్ ని నిర్లక్ష్యం చేయకండి. ప్రధాని మోదీ, రెండు డోసులూ తీసుకోవాల్సిందే