New Jersey Heavy Rains: అమెరికాను ముంచెత్తుతున్న హరికేన్లు… నీట మునిగిన న్యూజెర్సీ.. తేలాడుతున్న కార్లు, పలువురు గల్లంతు!

|

Sep 02, 2021 | 10:12 AM

అమెరికా ఈశాన్య తీరంపై హెన్రీ తుపాను విరుచుకుపడుతోంది. మరోవైపు ఇడా హరికేన్ తోడవడంతో భారీ వరదలు విలయం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఒక్కసారిగా వరద పోటెత్తింది.

New Jersey Heavy Rains: అమెరికాను ముంచెత్తుతున్న హరికేన్లు... నీట మునిగిన న్యూజెర్సీ.. తేలాడుతున్న కార్లు, పలువురు గల్లంతు!
New Jersey Heavy Rains
Follow us on

New Jersey Heavy Rains: అమెరికా ఈశాన్య తీరంపై హెన్రీ తుపాను విరుచుకుపడుతోంది. మరోవైపు ఇడా హరికేన్ తోడవడంతో భారీ వరదలు విలయం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఒక్కసారిగా వరద పోటెత్తింది. న్యూజెర్సీ రాష్ట్రంలో భారీ వరదల్లో చిక్కుకుని వందలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతయ్యారని స్థానిక మీడియా తెలిపింది.

వరదల ధాటికి వందల సంఖ్యలో ఇళ్లు నీట మునగగా, మరికొన్ని కూలిపోయాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. భారీ వరదల్లో వాహనాలు కొట్టుకుపోతున్నాయి. కనివినీ ఎరుగని రీతిలో.. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోందని అధికారులు పేర్కొన్నారు. 1982 నుంచి ఈ స్థాయిలో వర్షం నమోదుకావటం ఇదే మొదటిసారి. 7 అడుగుల మేర వరద ముంచెత్తడంతో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. కార్లు, వాహనాలు పడవల్లా నీటిపై తేలియాడుతున్నాయి. కొందరు చెక్క బల్లల సాయంతో వరదలో ఈదుకుంటూ బయటపడ్డారు. ఈ నేపథ్యంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలను కోరారు ఆ రాష్ట్ర గవర్నర్‌.

అటు, హెన్నీ తుఫాను ప్రభావంతో న్యూయార్క్‌, మసాసుసెట్స్‌, రోడ్‌ ఐలాండ్‌లలో భారీ వర్షాలు పడుతున్నాయి. సముద్రం పోటెత్తుతుండగా, గంటకు 70 మైళ్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. న్యూయార్క్‌ రాష్ట్రంలోని లాంగ్‌ ఐలాండ్‌లో ఆకస్మిక వరదలు వస్తాయని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. మరోవైపు, నేషనల్ వెదర్ సర్వీస్ వరదలకు హెచ్చరిక జారీ చేసింది. న్యూజెర్సీ ఇప్పటికే ఇటీవల వరుస తుఫానులతో అల్లాడిపోతుంది. తాజాగా హరికేన్ల ఉండవచ్చని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. న్యూజెర్సీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశముందని తెలిపారు. ఇడా హరికేన్ ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షం, ఈదురు గాలులు, సుడిగాలుల ముప్పు పొంచి ఉందన్నారు. మెర్సర్, హంటర్‌డాన్ కౌంటీలలోని డెలావేర్ నది పట్టణాల్లోని వారు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఇడా హరికేన్ ప్రభావంతో అట్లాంటిక్, బర్లింగ్టన్, కామ్డెన్, కేప్ మే, కంబర్‌ల్యాండ్, గ్లౌస్టర్, హంటర్‌డాన్, మెర్సర్, మిడిల్‌సెక్స్, మోన్‌మౌత్, మోరిస్, ఓషన్, సేలం, సోమర్‌సెట్, వారెన్ కౌంటీలకు బుధవారం రాత్రి 10 గంటల వరకు సుడిగాలి వాచ్ జారీ చేయబడింది. జాతీయ వాతావరణ సేవ అట్లాంటిక్, బర్లింగ్టన్, కేప్ మే, కంబర్‌ల్యాండ్, గ్లౌస్టర్, మెర్సర్, మోన్‌మౌత్, మహాసముద్రం కౌంటీల్లో బుధవారం భారీ వర్షం కురిసిందని మౌంట్ హోలీలోని జాతీయ వాతావరణ సేవ కేంద్ర తెలిపింది. అలాగే, అట్లాంటిక్ వైపు వెళ్లే సమయంలో తుఫాను వేగం పుంజుకుని ఈ మధ్యాహ్నం వేళల్లో సుడిగాలులు ఏర్పడే అవకాశం ఉందని, ఈ ప్రాంతాల్లో తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొంది.


Read Also..  Krishna district: కృష్ణా జిల్లాలో విషాదం.. ఆత్మహత్యకు యత్నించిన యువకుడు.. స్నేహితుడిని కాపాడబోయి ఇద్దరు మృతి!

Chanakya Niti: నాయకుడిగా ఉండాలంటే.. ఈ మూడు లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి.. అవేంటంటే!