ట్రంప్ ను తొలగించేందుకు యుఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ ‘సవరణ తీర్మానం’

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను పదవి నుంచి తొలగించేందుకు యూఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ సమాయత్తమయ్యారు. ఆయనను పదవీ చ్యుతుడ్ని చేయడానికి వీలుగా 25 వ సవరణను ఉపయోగించి ఓ కమిషన్ ను ఏర్పాటు చేస్తామని ఆమె ప్రకటించారు.

ట్రంప్ ను తొలగించేందుకు యుఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ సవరణ తీర్మానం

Edited By:

Updated on: Oct 10, 2020 | 11:26 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను పదవి నుంచి తొలగించేందుకు యూఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ సమాయత్తమయ్యారు. ఆయనను పదవీ చ్యుతుడ్ని చేయడానికి వీలుగా 25 వ సవరణను ఉపయోగించి ఓ కమిషన్ ను ఏర్పాటు చేస్తామని ఆమె ప్రకటించారు. ప్రస్తుత అధ్యక్షుడు ప్రజల సేవలో లేదా తన విధినిర్వణహలో విఫలమయ్యాడని ఈ కమిషన్ నిర్ధారించిన పక్షంలో.. దేశ ఉపాధ్యక్షుడే తాత్కాలిక అధ్యక్ష పదవిని చేబట్టేందుకు ఈ సవరణ వీలు కల్పిస్తుంది. కోవిడ్ బారిన పడిన ట్రంప్..ప్రవర్తనను, ఆయన ఆరోగ్యాన్ని పెలోసీ ప్రశ్నించారు. అసలు మీరు సేవ   చేయగల్గుతారా ? మీ హెల్త్ అందుకు సహకరిస్తోందా ? కోవిడ్ చికిత్స అనంతరం మీ ఆరోగ్యం ఎలా ఉంటోంది తదితర సమాచారాన్ని మీ ప్రభుత్వం తెలియజేయాల్సి ఉంది అని ఆమె అన్నారు. కరోనా వైరస్ చికిత్స పొందిన అనంతరం ట్రంప్ తీరు మరో రకంగా ఉంటోందన్న అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు.

అయితే ట్రంప్ మాత్రం ఆమెను తప్పు పడుతూ.. జో బైడెన్ ను అధ్యక్షుడిని చేయడానికే మీ నాటకమంతా అని నిప్పులు చెరిగారు.,