అమెరికా మిస్సిసిప్పీలో విషాదం నెలకొంది. క్లింటన్ ప్రాంతంలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. భారీగా ఎగసిపడిన మంటలు క్షణాల్లోనే ఇంటిని చుట్టుముట్టాయి. దీంతో ఇంట్లోని వారంతా హాహాకారాలు చేస్తూ అటూ ఇటూ పరుగులు తీశారు. పెద్ద ఎత్తున చెలరేగిన అగ్నికీలల్లో బయటికొచ్చే దారిలేక తల్లి సహా ఆరుగురు పిల్లలు సజీవదహనమయ్యారు.
భార్యా, పిల్లలను కాపాడేందుకు భర్త ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనలో తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారమందుకొని అక్కడికి చేరుకున్న పోలీసులు..అతన్ని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇల్లు పూర్తిగా కాలి బూడిదైంది. పిల్లల వయసు 1 నుంచి 15 ఏళ్ల మధ్యే ఉంటుందని తెలిపారు అధికారులు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.