నాయకునిగా డోనాల్డ్ ట్రంప్ విఫలం, కమలా హారిస్
అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా విఫలమయ్యారని ఉపాధ్యక్ష పదవికి డెమొక్రాట్ నామినీ కమలా హారిస్ ఆరోపించారు. ప్రజల 'విషాదాలను' ఆయన తన రాజకీయ ఆయుధాలుగా మార్చుకుంటున్నాడని అన్నారు.
అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా విఫలమయ్యారని ఉపాధ్యక్ష పదవికి డెమొక్రాట్ నామినీ కమలా హారిస్ ఆరోపించారు. ప్రజల ‘విషాదాలను’ ఆయన తన రాజకీయ ఆయుధాలుగా మార్చుకుంటున్నాడని అన్నారు. అమెరికన్లందరినీ ఒక్క తాటిపైకి తెచ్ఛే జో బిడెన్ ని అధ్యక్షునిగా ఎన్నుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ట్రంప్ నాయకత్వం ప్రజల ప్రాణాలను, జీవితాలను బలిగొంటోందని, మనం ఇప్పుడు ‘గాయపడిన’ స్థితిలో ఉన్నామని అన్నారు. అటు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా..ట్రంప్ నాయకత్వాన్ని దుయ్యబట్టారు.
2017 లో వైట్ హౌస్ ని ట్రంప్ కి అప్పగిస్తున్నప్పుడు తన పదవికి ఆయన వన్నె తెస్తాడని ఆశించామని, కానీ అలాంటిదేమీ జరగలేదని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో కొత్త మార్పులు తెస్తాడనుకుంటే ఆ ఆశలు కూడా నెరవేరలేదన్నారు. ప్రపంచంలో అమెరికా ప్రతిష్ట దిగజారిపోయిందని ఒబామా ఆవేదన వ్యక్తం చేశారు.