Johnson and Johnson: కరోనాను అరికట్టేందుకు పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఇక కరోనా వ్యాక్సిన్లకు భిన్నంగా జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ సింగిల్ డోస్ టీకా తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్, కోవాగ్జిన్, మోడెర్నా, ఫైజర్ లాంటి వ్యాక్సిన్లన్నీ డబుల్ డోస్ టీకాలే. అయితే అమెరికా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ టీకాపై స్వదేశంలోనే సందేహాలు తలెత్తాయి. ఈ వ్యాక్సిన్‌కు అమెరికాలో ఇటీవల అత్యవసర వినియోగానికి అనుమతులు లభించాయి. అయితే 6,200 వ్యాక్సిన్ డోసులను డెట్రాయట్ పంపగా, నగర మేయర్ మైక్ డుగ్గాన్ వాటిని తిరస్కరించారు.
ఫైజర్ బయో ఎన్ టెక్ మోడెర్నా వ్యాక్సిన్ల పనితీరు బాగుందని, వాటితో పోల్చితే జాన్సన్ అండ్ జాన్సన్ టీకా పనితీరు అంతాగా లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఫైజర్-బయో ఎన్‌టెక్ వ్యాక్సిన్ రెండో డోసు ఇచ్చిన 7 రోజుల తర్వాత 95 శాతం ప్రభావంతంగా పని చేస్తోందని, మోడెర్నా టీకా రెండో డోసు ఇచ్చిన 14 రోజుల తర్వాత 94 శాతం సమర్థవంతంగా పని చేస్తోందని ఆయన వెల్లడించారు. కానీ జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ సింగిల్ డోస్ ఇచ్చిన 28 రోజుల తర్వాత 66 శాతం మాత్రమే సమర్థత చూపుతోందని అన్నారు. ఇదిలా ఉండగా, దీనికంటే స్పుత్నిక్ వి 92శాతం, నోవా వ్యాక్స్ 89 శాతంగా పని చేస్తున్నట్లు తెలిపారు. అయితే అత్యవసర వినియోగానికి అనుమతులు లభించిన ఈ వ్యాక్సిన్ .. పది కంపెనీలో వ్యాక్సిన్ పనితీరు మెరుగ్గా లేదని తేల్చి చెప్పారు.
ఇవీ చదవండి: YS Jagan: కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్..
Bharat Biotech’s Covaxin: భారత్ బయోటెక్.. కోవాక్సిన్‌ను నిరాకరించిన బ్రెజిల్.. ఎందుకంటే..?