కరోనా వైరస్‌తో తల్లడిల్లుతున్న అగ్రరాజ్యంపై.. ప్రకృతి కూడా పగబట్టింది. అమెరికాలో వరుస తుఫాన్లు బీభత్సం సృష్టిస్తున్నాయి.16 ఏళ్ల క్రితం గడగడలాడించిన కత్రినా హరికేన్‌ను మించిన మరో తుఫాన్ ఐదా విరుచుకుపడుతోంది. లూసియానాలో విధ్వంసం సృష్టిస్తోంది. అమెరికాలో వరదబీభత్సం ఎలా ఉందో తెలుసుకుందాం.. అమెరికాను జలవిలయం ముంచెత్తింది. వరుసగా విరుచుకుపడుతున్న భీకర తుఫాన్లు… బీభత్సం సృష్టిస్తున్నాయి. 16 ఏళ్ల క్రితం అమెరికాను గడగడలాడించిన కత్రినా హరికేన్‌ను మించిన మరో హరికేన్ ఐదా పంజా విసురుతోంది. ప్రమాదకరమైన 4వ కేటగిరీకి చెందిన తుపానుగా మారిన ఐదా.. లూసియానా తీరప్రాంతంలో విధ్వంసం సృష్టిస్తోంది. గంటకు 241 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలలతో.. లూసియానా రాష్ట్రం వణికిపోతోంది.
ఆగ్నేయ లూసియానా మీదుగా.. ఉత్తరం వైపునకు కదిలిన ఐదా హరికేన్… మెక్సికో ఉత్తర గల్ఫ్‌ను దాటి లూసియానా తీరాన్ని తాకింది. న్యూ ఒర్లాన్స్‌కు దక్షిణాన 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోర్ట్ ఫోర్చౌన్దగ్గర తీరాన్ని తాకింది. ఈ సమయంలో తుపాను విలయం సృష్టించింది. దీంతో లూసియానా తీరప్రాంతం చిగురుటాకులా వణికిపోయింది.
తుఫాన్ ధాటికి.. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఎన్నో కాలనీలు జలదిగ్భందంలో ఇరుక్కుని.. బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు జనం. మిస్సిసిపిలో ఐదా తుపాను తీవ్ర ప్రభావాన్ని చూపించింది. తుపాను తీరందాటే సమయంలో వీచిన పెనుగాలుల ధాటికి మిస్సిసిపి నది ఏకంగా రివర్స్‌లో ప్రవహించింది. పదుల సంఖ్యలో బ్యారేజీలో కొట్టుకుపోయాయి.
న్యూ ఓర్లీన్స్ పైనా ఐదా ఎఫెక్ట్ చూపించింది. ప్రచండ గాలులతో అనేక ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టం అయ్యాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. కరెంట్ కట్ అయి.. చాలా ప్రాంతాలు అంధకారం అయ్యాయి. న్యూ ఓర్లీన్స్ లో దాదాపు 8లక్షల మంది చీకట్లోనే ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది.
తుపాన్ తీవ్రత తగ్గే వరకు లూసియానా ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ జాగ్రత్త వహించాలని అధ్యక్షుడు బైడెన్ సూచించారు. తుపాను ప్రభావిత రాష్ట్రాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
లూసియానా, మిస్సిసిపిల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించిన అధికారులు.. ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. తుపాను బాధితుల కోసం అత్యవసర ప్రాతిపదికన షెల్టర్లు ఏర్పాటుచేశారు. లూసియానా నుంచి ఇప్పటికే వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఇవి కూడా చదవండి: Driving License at Home: ఇంట్లో కూర్చొని మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యూవల్ చేసుకోండి.. జస్ట్ ఇలా చేయండి.. అంతే..
నల్లధనం తెప్పించారా.. అకౌంట్‌లో వేశారా.. బీజేపీపై మంత్రి హరీష్ రావు ప్రశ్నల వర్షం..