Marijuana Legalised: అమెరికాలోని న్యూజెర్సీ స్టేట్ మాదకద్రవ్యాల వాడకానికి చట్టబద్దత కల్పించింది. 18 ఏళ్లపైబడిన వారు వీటిని కొనుగోలు చేయవచ్చు.. మరోవైపు థాయ్‌లాండ్‌లోనూ ఇలాంటి డిమాండ్ వినిపిస్తోంది.. యూఎస్‌లోని మరో రాష్ట్రంలో మాదకద్రవ్యాల అమ్మకాలు, వినియోగానికి చట్టబద్దత లభించింది.. న్యూజెర్సీలో ఇక మారిజువానా చట్టబద్దంగా కొనుగోలు చేయవచ్చు.. ప్రభుత్వ ఆమోదంతో 13 డిస్పెర్సరీలు, స్టోర్స్‌లో మాదకద్రవ్యాల కొనుగోళ్లు ప్రారంభించారు.. కొన్ని రకాల వ్యాధులతో కలిగే నొప్పుల ఉపశమనం కోసం అవసరమైన డ్రగ్స్ ఇక్కడ అమ్ముతారు.. అయితే వీటిని 21 ఏళ్లకన్నా ఎక్కువ వయసున్నవారికి మాత్రమే విక్రయిస్తారు..
అమెరికాలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో మారిజువానాతో పాటు మరికొన్ని మాదకద్రవ్యాల విక్రయాలకు చట్టబద్దత ఉంది.. న్యూజెర్సీ, డిస్ట్రిక్ట్ కొలంబియా ఇప్పుడు వీటి సరసన చేరాయి.. గంజాయి స్మగ్లింగ్‌ను నివారించి, సురక్షిత, చట్టబద్ద ప్రక్రియలో విక్రయించడం ద్వారా నేరాలకు అడ్డుకట్టవేయవచ్చని అధికారులు అంటున్నారు.. వైద్య పరంగా ప్రత్యేక అనుమతి ఉన్నవారికే వీటిని విక్రయిస్తారని చెబుతున్నారు.. ఇకపై రహస్యంగా గంజాయిని కొనాల్సిన అవసరం లేదని, తమకు ఇది నిజమైన స్వేచ్ఛఅని కొందరు వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..
మరోవైపు థాయిలాండ్‌లో గంజాయి ప్రియులు వినూత్న ర్యాలీ నిర్వహించారు. థాయిలాండ్‌లో ఇప్పటికే వైద్య అవసరాల కోసం గంజాయి వాడకానికి చట్టబద్దత ఉంది. అయితే పూర్తి స్థాయిలో గంజాయి అమ్మకాలకు చట్టబద కల్పించాలని వీరి డిమాండ్.. ర్యాలీలో పాల్గొన్నవారంతా గంజాయి సిగరెట్లు, చుట్టలు ఊదుతూ హంగామా చేశారు..