అమెరికా అధ్యక్ష పదవికి డెమొక్రాట్ అభ్యర్థిగా జో బిడెన్

| Edited By: Anil kumar poka

Aug 19, 2020 | 2:04 PM

నవంబరులో జరగనున్న అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి డెమొక్రాట్ అభ్యర్థిగా జో బిడెన్ నామినేట్ అయ్యారు. దీంతో అధికారికంగా ఆయన నామినేట్ అయినట్టయింది. ఇక ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ని ఆయన ఎదుర్కోనున్నారు.

అమెరికా అధ్యక్ష పదవికి డెమొక్రాట్ అభ్యర్థిగా జో బిడెన్
Follow us on

నవంబరులో జరగనున్న అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి డెమొక్రాట్ అభ్యర్థిగా జో బిడెన్ నామినేట్ అయ్యారు. దీంతో అధికారికంగా ఆయన నామినేట్ అయినట్టయింది. ఇక ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ని ఆయన ఎదుర్కోనున్నారు. ఈ నామినేషన్ తన జీవితానికే గౌరవప్రదమని బిడెన్ ట్వీట్ చేశారు. డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ జరిగిన రెండో రోజే ఈ నామినేషన్ ప్రక్రియను నిర్వహించారు. కన్వెన్షన్ తొలి రోజున ఇదివరకటి, ప్రస్తుత డెమొక్రటిక్ నేతలు బిడెన్ అభ్యర్థిత్వానికి మద్దతునిస్తూ ప్రసంగాలు చేశారు. ఓటింగ్ పూర్తి అయిన అనంతరం మాట్లాడిన బిడెన్.. తనను నామినీగా ఎన్నుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మళ్ళీ మిమ్మల్ని వచ్ఛే గురువారం కలుస్తాను అన్నారు.

మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, మాజీ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ, మాజీ రిపబ్లికన్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ కొలిన్ పావెల్ తదితరులు ఈ సందర్భంగా అక్కడ హాజరయ్యారు. అమెరికా ఎన్నికలకు ఇక 77 రోజుల వ్యవధి ఉంది.