US school: అమెరికా పాఠశాలలో కాల్పులతో బీభత్సం సృష్టించిన ఆరో తరగతి విద్యార్థిని.. ముగ్గురికి గాయాలు

US school: ఆరో తరగతి విద్యార్థిని తాను చదువుతున్న పాఠశాలలో తుపాకీతో కాల్పులు జరిపి బీభత్సం సృష్టించింది. అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఘటన చోటు

US school: అమెరికా పాఠశాలలో కాల్పులతో బీభత్సం సృష్టించిన ఆరో తరగతి విద్యార్థిని.. ముగ్గురికి గాయాలు

Updated on: May 07, 2021 | 2:38 PM

US school: ఆరో తరగతి విద్యార్థిని తాను చదువుతున్న పాఠశాలలో తుపాకీతో కాల్పులు జరిపి బీభత్సం సృష్టించింది. అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదాహో రాష్ట్రంలోని ఓ పాఠశాలలో రిగ్బి మిడిల్‌ స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్న ఓ బాలిక పాఠశాలకు వచ్చే సమయంలోనే ఓ తుపాకీని వెంట తెచ్చుకుంది. పాఠశాలలో విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడటంతో ఇద్దరు విద్యార్థులు, పాఠశాల సిబ్బందిలో ఒకరికి గాయాలయ్యాయి. దీంతో వారిని హుటాహుటిన పాఠశాల సిబ్బంది చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారు ముగ్గురు కోలుకుంటున్నారని, ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులు జరిపిన బాలికను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అమెరికాలో తుపాకీ సంస్కృతి కారణంగా తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఈ ఘటన పాఠశాలలో చోటు చేసుకోవడం కలకలం సృష్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

ఇవీ కూడా చదవండి:

Corona Vaccine: ప్రపంచంలోనే అత్యధికంగా టీకాలు వేసిన ఈ దేశంలో కరోనా మళ్లీ తిరగబడుతోంది.. అన్ని రంగాలు మూసివేత

Terrorists: మాల్దీవుల మాజీ అధ్యక్షుడిపై ఉగ్రవాదుల బాంబు దాడి..ఆందోళన వ్యక్తం చేసిన భారత్

Loading...
Unable to load recommendations.
Follow Us