ఎలుగుబంటితో ఫైట్ చేసిన శునకం

శునకాలు విశ్వాసానికి మారు పేరు అంటారు. అందుకే చాలామంది వాటిని తమ ఇళ్లలో రక్షణగా పెట్టుకుంటారు. ఇప్పుడీ నమ్మకం నిజమని నిరూపిస్తోంది ఈ గ్రామ సింహం. న్యూజెర్సీ హెవిట్‌లోని ఓ ఇంట్లోకి చొరబడిన ఎలుగుబంటిని తరిమితరిమి కొట్టింది ఓ శునకం. ఎలుగుబంటిపై దాడి చేస్తూ.. పరుగులు పెట్టించిన విజువల్స్ అన్ని అక్కడే ఉన్న ఓ సీసీఫుటేజీలో రికార్డయ్యాయి. ఆ రికార్డైన దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు అక్కడి వారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా […]

ఎలుగుబంటితో ఫైట్ చేసిన శునకం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 13, 2019 | 3:19 AM

శునకాలు విశ్వాసానికి మారు పేరు అంటారు. అందుకే చాలామంది వాటిని తమ ఇళ్లలో రక్షణగా పెట్టుకుంటారు. ఇప్పుడీ నమ్మకం నిజమని నిరూపిస్తోంది ఈ గ్రామ సింహం. న్యూజెర్సీ హెవిట్‌లోని ఓ ఇంట్లోకి చొరబడిన ఎలుగుబంటిని తరిమితరిమి కొట్టింది ఓ శునకం. ఎలుగుబంటిపై దాడి చేస్తూ.. పరుగులు పెట్టించిన విజువల్స్ అన్ని అక్కడే ఉన్న ఓ సీసీఫుటేజీలో రికార్డయ్యాయి. ఆ రికార్డైన దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు అక్కడి వారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.