అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం.. రెండు రోజుల్లో 2 బ్యాంకులు మూసివేత.. తాజా సిగ్నేచర్ బ్యాంక్ లాక్

|

Mar 13, 2023 | 12:29 PM

Signature Bank: సిగ్నేచర్‌ బ్యాంకును ది ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ తన నియంత్రణలోకి తీసుకుంది. క్రిప్టోకరెన్సీలో ఉన్న రిస్క్ దృష్ట్యా, ఈ బ్యాంక్‌ను తాత్కాలికంగా మూసివేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది.

అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం.. రెండు రోజుల్లో 2 బ్యాంకులు మూసివేత.. తాజా సిగ్నేచర్ బ్యాంక్ లాక్
Signature Bank
Follow us on

అమెరికాలో గత రెండు రోజుల్లో రెండు బ్యాంకులు మునిగిపోయాయి. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ దివాళా తీసిన తర్వాత ఇప్పుడు అమెరికా సిగ్నేచర్ బ్యాంక్ కూడా దివాళా తీసింది. ఈ మేరకు అమెరికాకు చెందిన నియంత్రణ సంస్థలు ప్రకటించాయి. దాదాపు 110.36 బిలియన్ డాటర్ల ఆస్తులను కలిగి ఉన్న సిగ్నేచర్ బ్యాంక్‌ను ది ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ స్వాధీనం చేసుకుంది. క్రిప్టో కరెన్సీతో ఎక్కువగా సంబంధాలున్న సిగ్నేచర్‌ బ్యాంక్‌ మూసివేయడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం స‌ృష్టిస్తోంది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే అమెరికాలో ఇలా కీలక బ్యాంకులు మూతపడడంతో బ్యాంకింగ్‌ రంగంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

అమెరికాలో ఆర్థిక సంక్షోభం సమయంలో కుప్పకూలడం ఇది రెండవ అతిపెద్ద షట్‌డౌన్. అమెరికా బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద సంక్షోభం 2008 సంవత్సరంలో వచ్చింది. ఆ సంవత్సరం బ్యాంకింగ్ సంస్థ లెమాన్ బ్రదర్స్ దివాలా తీసింది. దీని తరువాత, అమెరికాతో సహా ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఆర్థిక వ్యవస్థ వెన్ను విరిగిపోయింది. అయితే ప్రస్తుతం US బ్యాంకింగ్ చరిత్రలో మూడవ అతిపెద్ద వైఫల్యం ఇదని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

అమెరికాలో రెండు బ్యాంకులు మూతపడగా.. ఆ తర్వాత కూడా అమెరికా మార్కెట్లు ఊపందుకున్నాయి. డిపాజిటర్ల సొమ్ము భద్రంగా ఉందని, వారు తమ డబ్బును విత్ డ్రా చేసుకునేందుకు వీలుంటుందని అమెరికా ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చింది. అయితే సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్‌లలో ఏమి జరిగింది.. ఈ రెండు బ్యాంకులు ఎలా మూసివేయబడ్డాయన్ని ప్రశ్నార్థకంగా మారింది.

సిగ్నేచర్‌ బ్యాంకును ది ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ తన నియంత్రణలోకి తీసుకుంది. క్రిప్టోకరెన్సీలో ఉన్న రిస్క్ దృష్ట్యా, ఈ బ్యాంక్‌ను తాత్కాలికంగా మూసివేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. సిగ్నేచర్‌కు గత ఏడాది ముగిసే నాటికి 110.36 బిలియన్‌ డాలర్ల ఆస్తులు, 88.59 బిలియన్‌ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయి. అయితే, ప్రస్తుతం బ్యాంకు డిపాజిటర్లు తమ నిధులను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఉంటుందని ఎఫ్‌డీఎఫ్‌డీఐసీ స్పష్టం చేసింది. అందుకోసం తాత్కాలికంగా ఓ ‘బ్రిడ్జ్‌ బ్యాంక్‌’ను ఏర్పాటు చేశామని తెలిపింది. దీని ద్వారా సిగ్నేచర్‌ కస్టమర్లు, డిపాజిటర్లు తమ నిధులకు యాక్సెస్‌ పొందొచ్చని పేర్కొంది. ఈ తాత్కాలిక బ్యాంకుకు గ్రెగ్‌ కార్మికేల్‌ అనే బ్యాంకింగ్‌ నిపుణుడిని సీఈఓగా నియమించింది.

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ వ్యాపారం అమెరికాలో స్టార్టప్‌ల కోసమే. ఈ బ్యాంకు స్టార్టప్ కంపెనీల నుంచి డిపాజిట్లు కూడా తీసుకుంటుంది. వారికి రుణాలు కూడా ఇస్తుంది. అమెరికాతో పాటు వివిధ దేశాల స్టార్టప్‌లలో ఈ బ్యాంక్ బాగా ప్రాచుర్యం పొందింది. ఈ బ్యాంక్ గత ఐదేళ్లుగా బెస్ట్ బ్యాంక్ అవార్డును గెలుచుకుంటోంది. అయితే ఈ బ్యాంకు ఒక్క ఏడాదిలోనే దివాలా తీసింది. SVB బ్యాంక్ ఈ డబ్బును US బాండ్లలో పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచిన తర్వాత, బాండ్‌లో క్షీణత కనిపించింది.

న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేస్తున్న సిగ్నేచర్ బ్యాంక్‌.. రియల్ ఏస్టేట్, డిజిటల్‌ అసెట్స్‌ బ్యాంకింగ్‌ సహా మొత్తం తొమ్మిది విభాగాల్లో ఈ బ్యాంకు సేవలందిస్తోంది. గత ఏడాది సెప్టెంబరు నాటికి ఈ బ్యాంకు డిపాజిట్లలో మూడో వంతు క్రిప్టో రంగం నుంచి వచ్చినవే. అయితే, తమ క్రిప్టో ఆధారిత డిపాజిట్లను త్వరలోనే 8 బిలియన్‌ డాలర్లకు కుదించుకుంటామని డిసెంబరులో బ్యాంకు ప్రకటించింది. మరోవైపు తమ సీఈఓ జోసెఫ్‌ డీపావోలో సీనియర్‌ సలహాదారుగా మారనున్నారని ఫిబ్రవరిలోనే తెలిపింది. ఆయన స్థానంలో చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఎరిక్‌ హొవెల్‌ బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొంది. బ్యాంకు ప్రారంభమైన 2001 నుంచి డీపావోలో సీఈఓ, అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.

అటువంటి పరిస్థితిలో అమెరికాలో ఆర్థిక మాంద్యం దెబ్బకు బ్యాంకులు కుదేలయ్యాయి. స్టార్టప్‌లు తమ డబ్బును బ్యాంకు నుండి విత్‌డ్రా చేయడం ప్రారంభించాయి. స్టార్టప్‌కు ఆర్థిక సహాయం చేయడానికి, బ్యాంక్ 21 బిలియన్ డాలర్ల విలువైన బాండ్లను విక్రయించింది. బాండ్‌ను విక్రయించడంలో బ్యాంక్ దాదాపు 1.75 బిలియన్ డాలర్లు అంటే రూ.15,000 కోట్లు రూనష్టాన్ని చవిచూసింది.

అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు వల్ల బ్యాంకులపైనా దీని ప్రభావం బాగా కనిపించింది. ఈ విషయం తరువాత, US ప్రభుత్వం, సెంట్రల్ బ్యాంక్ చర్య తీసుకున్నాయి. డిపాజిటర్లకు పూర్తి డబ్బు అందజేస్తామని అమెరికా ప్రభుత్వం హామీ ఇచ్చింది. డిపాజిటర్లకు ఎంత కావాలంటే అంత డబ్బు తీసుకోవచ్చని ఫెడ్ స్పష్టం చేసింది. ఇది కాకుండా, బ్యాంకులకు కొత్త బ్యాంక్ టర్మ్ ఫండింగ్ ప్రోగ్రామ్‌ను ప్రకటించారు. మరోవైపు బ్యాంకులు ద్రవ్యలభ్యత సమస్యలు ఎదుర్కోకుండా 25 మిలియన్‌ డాలర్లతో తాత్కాలిక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ఫెడ్‌ ప్రకటించింది. అలాగే సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌లో డిపాజిట్‌దారులు తమ నిధులను ఉపసంహరించుకునేందుకు సోమవారం నుంచి అనుమతి ఉంటుందని తెలిపింది.

కేవలం రెండు రోజుల్లో రెండు బ్యాంకులు మూతపడటంతో స్టాక్ 85 శాతం పడిపోవటంతో ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు 45 రోజుల జీతాన్ని చెల్లిస్తామని ఆఫర్ చేసింది. దీని ద్వారా బ్యాంక్ ఉద్యోగులు బయటకు వెళ్లిపోకుండా కాపాడాలని నిర్ణయించింది. 2022 చివరి నాటికి బ్యాంక్ మెుత్తంగా 8,528 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఈ క్రమంలో కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలోని బ్యాంక్ ప్రధాన కార్యాలయం, కాలిఫోర్నియా, మసాచుసెట్స్‌లోని 17 శాఖలు సోమవారం తిరిగి తెరవబడతాయని FDIC ప్రకటించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..